AP Politics: వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరు..? టీడీపీ కంచుకోటలో ఫ్యాన్‌ గాలి వీస్తుందా?

నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న దూకుడుకు కళ్లెం వేసేందుకు వైసీపీ కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట అయిన నర్సీపట్నంలో గత ఎన్నికల్లో వైసీపీ గెలవడం నిజంగా పెను సంచలనం. అయితే గెలిచిన తర్వాత ఉమా శంకర్‌ గణేశ్‌ క్యాడర్‌ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాపను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

New Update
AP Politics: వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరు..? టీడీపీ కంచుకోటలో ఫ్యాన్‌ గాలి వీస్తుందా?

ఆ నియోజకవర్గం ఉమ్మడి విశాఖ జిల్లా(Vizag District)ల్లో టీడీపీకి కంచుకోట. ఆ మాజీ మంత్రి ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా 5 సార్లు విజయం సాధించారు.. అలాంటి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో జగన్ మ్యానియాకు, ఫ్యాను గాలికి సైకిల్ టైర్ పంచర్ అయ్యింది. అలాంటి అసెంబ్లీ సెగ్మెంట్‌ ఇప్పుడు అధికార వైసీపీకి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.. ఎమ్మెల్యే పని తీరు బాగోకపోవడం.. సమన్వయ లోపంతో కేడర్ సతమతం అవుతున్నారు ఇంతకీ ఎక్కడా నియోజకవర్గం..? ఏమిటా కథ అనుకుంటున్నారా..? మీరూ ఓ లుక్కేయండి.!

ఆ కులం ఓటర్లే ఎక్కువే:
ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం(Narsipatnam) నియోజకవర్గానికి చాలా రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఈ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా చెబుతుంటారు.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ నియోజకవర్గం నుంచి 1983 మొదలు ఇప్పటి వరకూ 5 సార్లు విజయం సాధించారు. ఇక్కడ వెలమ కులం ఓటర్లు అధికంగా ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్‌ విజయం సాధించారు. టీడీపీకి, అయ్యన్నకి కంచుకోటగా ఉన్న నర్సీపట్నంలో ఇతర అభ్యర్థి విజయం సాధించడం అంత ఈజీ కాదు. అంతటి గొప్ప విజయం సాధించిన అనంతరం నియోజకవర్గంలో పార్టీని, క్యాడర్‌ను సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే ఉమా శంకర్‌ గణేశ్‌ విఫలమయ్యారనేది ఆ పార్టీ వర్గాల నుంచి వినపడుతున్న మాట.. అయ్యన్నను రాజకీయంగా ఎదుర్కోవడంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారనే వాదన బలంగా ఉంది. అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ఘాటైనా వ్యాఖ్యలు చేస్తున్నా ఎమ్మెల్యే నుంచి స్పందన లేకపోవడంతో పార్టీ నాయకత్వం ఆయన పట్ల సీరియస్‌గా ఉన్నట్టు భోగట్టా.

publive-image అయ్యన్న, ఉమా శంకర్‌ గణేశ్‌, బోలెం ముత్యాల పాప

వైసీపీ ప్లాన్‌ ఏంటంటే?
నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న దూకుడుకు కళ్లెం వేసేందుకు వైసీపీ అధిష్టానం కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అవలంబించిన వ్యూహన్ని అమలు చేయాలని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాపను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తుందట. గతంలో అయ్యన్నను ఓడించిది ఈమె. అదే వ్యూహం వచ్చే ఎన్నికల్లో అమలు చేసేలా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. అయితే ప్రస్తుతానికి ముత్యాలపాప టీడీపీలో ఉన్నారు ఆమెను పార్టీలోకి తీసుకొని వచ్చే బాధ్యత ముత్యాల పాప వియ్యంకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్‌కు అప్పగించారట సీఎం జగన్. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ముత్యాలపాప వైసీపీ తీర్థం పుచ్చుకొని నర్సీపట్నం వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగితే పోటీ రసవత్తరంగా ఉంటుందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం.

గణేశ్‌ ఎందులో ఫెయిల్ అయ్యారంటే?
గతంలో అయ్యన్నను ఓడించిన అనుభవం, బలమైన క్యాడర్ ముత్యాలపాపకు ఉంది. ఇప్పుడున్న పరిణామల దృష్ట్యా ఆమె పోటీకి సిద్దమైతే అయ్యన్నను ఓడించేందుకు అన్ని వనరులు వైసీపీ అధిష్టానమే సమకూర్చే అవకాశం లేకపోలేదు. ఇక్కడ వైసిపిని వర్గపోరు కూడా వెంటాడుతుంది.. అందరినీ కలుపుకొని వెళ్లడంలో ఎమ్మెల్యే గణేశ్‌ ఫెయిల్ అయ్యారని పార్టీ క్యాడర్ బలంగా అభిప్రాయపడుతుంది. అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు పార్టీలోకి వచ్చిన తరువాత ఆయనకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తగిన ప్రాదాన్యత ఇవ్వకపోవడం.. అనుభవం లేని కొందరు వ్యక్తులకు మాత్రమే ఎమ్మెల్యే ప్రాదాన్యత ఇవ్వడం వంటి అంశాలు పార్టీని గందరగోళంలోకి నేడుతున్నాయి. ఈ పరిణామాలు చూసిన తరువాత అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు కూడా టికెట్ తనకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారట.. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ అగ్రనాయకత్వం ఈసారి అభ్యర్థి మార్పు అనివార్యమనే నిర్ణయానికి వచ్చిందట..? అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడికి అవకాశం ఇస్తే బాగుంటుందా..? లేదంటే 2009 ఎన్నికల వ్యూహన్ని అమలు చేస్తే బాగుంటుందా అనే ఆలోచనలో పడిందట అధిష్టానం.

ALSO READ: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. ఈ సారి ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు