Andhra Pradesh : ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేసిన ఈసీ..

అనంతపురం జిల్లా లోని ఇద్దరు డీఎస్పీల పై ఎలక్షన్ సంఘం చర్యలు చేపట్టింది.అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

New Update
Big Breaking : ఏపీలో పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై ఈసీ కీలక ఆదేశాలు

EC : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇద్దరు డీఎస్పీ(DSP) లపై ఎన్నికల సంఘం(Election Commission) చర్యలు తీసుకుంది. వివాదాస్పద అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేసింది. టీడీపీ(TDP) నేతల ఫిర్యాదుపై విచారణ జరిపిన ఈసీ తాజాగా చర్యలు తీసుకుంది. అనంతపురం టౌన్ లో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లుగా అనంతపురం టౌన్ లో వీరరాఘవరెడ్డి తమ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడింది.

నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ టీడీపీ జిల్లా నేతలను జైలు పాలు చేశారని ఆరోపించింది. ఇటీవల టీడీపీ నేతపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. దీనిపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం.. డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై వేటు వేసింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటీ డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా పైనా వేటు వేసింది. ఈ ఇద్దరు అధికారులను వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. తమ సబార్డినేట్స్ కు ఛార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని డీజీపీ మెమోరాండం రిలీజ్ చేశారు.

Also Read : బంజారాహిల్స్ పబ్ లో అసభ్యనృత్యాలు..నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు