/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/YSRCP-jpg.webp)
Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖలో పార్టీకి చెందిన ముఖ్యనేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు పంపించారు. అయితే, తనకు టికెట్ రానుందనే దాడి విరభద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి దాడివీరభద్రరావు అనకాపల్లి టికెట్‌ను ఆశించారు. అయితే, టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలో తన కార్యకర్తలతో అనకాపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. తన నిర్ణయంపై కార్యకర్తలతో చర్చించారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని వీరభద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. తన రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డిలకు కూడా పంపారు. కాగా, విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి మాత్రం ఆయన తన రాజీనామా లేఖను పంపలేదు.
తెలుగుదేశం పార్టీలో టాప్ లీడర్‌గా ఉన్న దాడి వీరభద్రరావు.. అనేక పదవులు చేపట్టారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో అనకాపల్లి కాకుండా.. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ కు కేటాయించింది వైసీపీ. అయితే, అక్కడ అతను ఓటమిపాలయ్యాడు. ఇప్పుడు మరోసారి పోటీకి సిద్ధపడుతుండగా.. పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో దాడివీరభద్రరరావు తీవ్ర అసంతృప్తికి లోనై.. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు.
జనసేనలో చేరే ఛాన్స్..
వైసీపీని వీడిని దారి వీరభద్రరావు.. త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పవన్ కల్యాణ్‌ను కలిశారు వీరభద్రం. ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో.. ఆ పార్టీలో చేరిక దాదాపు కన్ఫామ్ అని అంటున్నారు వీరభద్రం అనుచరులు. ఇక పవన్ సైతం వీరభద్రం రాకను స్వాగతిస్తున్నారట. ఆయన వస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని విశ్వసిస్తున్నారట జనసేనాని.
Also Read: