CM YS Jagan: కడప పర్యటనకు సీఎం జగన్.. అక్కడే క్రిస్మస్ వేడుకలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. అలాగే ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం. By Shiva.K 23 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) వైఎస్సార్ కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. మూడు రోజులు అక్కడ పర్యటించారు. శని, ఆది, సోమవారాల్లో జిల్లాలో పర్యటిస్తారు సీఎం. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం జగన్. ట్రాఫిక్ ఆంక్షలు.. కాగా, సీఎం జగన్ పర్యటన సందర్భంగా కడప నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇందులో భాగంగా కొన్ని బస్సులరూట్లు మళ్లించారు. ఇవాళ తాడేపల్లి నివాసం నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడినుంచి నేరుగా ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గోపవరం చేరుకున్నారు. సెంచురీ ఫ్లై ఇండస్ట్రీలో ఎండిఎఫ్, హెపిల్ ప్లాంట్లను ప్రారంభించారు. ఆ సంస్థ చైర్మన్ , సిబ్బందితో కాసేపు మాట్లాడారు. రూ. 1000 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ వల్ల 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అక్కడనుంచి బయలుదేరి వైయస్ఆర్ కేర్ బ్లాక్, వైఎస్సార్ మానసిక వైద్యశాలను ప్రారంభించారు సీఎం జగన్. అటు తరువాత కడపలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని, రిమ్స్‌లో వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించారు. ఆ తరువాత దివ్యాంగులకు ట్రై స్కూటర్ లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆధునీకరించిన కలక్టరెట్ భవనాన్ని ప్రారంభించి, కోటిరెడ్డి సర్కిల్ లో గాంధీజీ దండి మార్చ్ విగ్రహాలు ఆవిష్కరణ చేశారు. వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల అనంతరం కడప నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకొని అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు సీఎం జగన్. 24 వ తేదీ సింహాద్రి పురంలో పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయలో మండల ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం ఇడుపుల పాయలోనీ ప్రార్థన మందిరంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ముందస్తు క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొంటారు. 25 వతేది పులివెందులలో సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొంటారు సీఎం జగన్. Also Read: సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..! హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే! #andhra-pradesh-news #cm-ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి