AP Government: ఏపీకి మరో 850 ఎంబీబీఎస్ సీట్లు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!

ఏపీ మెడికల్‌ విద్యార్థులకుప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీ మెడికల్‌ కాలేజీలో అదనంగా 850 సీట్లు... పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో ఏర్పాటు చేసే కాలేజీలకు 750 సీట్లు ఇవ్వగా మరో 100 సీట్లు అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు కాలేజీల్లో ఇవ్వనున్నారు.

New Update
AP Government: ఏపీకి మరో 850 ఎంబీబీఎస్ సీట్లు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!

5 New Medical Colleges in AP: ఏపీలోని మెడికల్ విద్యార్థలకు ఏపీ ప్రభుత్వం (AP Government)  ఓ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో మరో 850 ఎంబీబీఎస్‌ సీట్లను (MBBS Seats) పెంచనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేలకు పైగా ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 850 సీట్లు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024-25 సంవత్సరం నుంచి రాష్ట్రం కొత్త కాలేజీల ద్వారా 750 సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

మరో 100 సీట్లనను అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు కాలేజీల్లో ఇచ్చేందుకు అధికారులు ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. కొత్త కాలేజీలు అయిన పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

2025- 26 నుంచి రాష్ట్రంలో మరో 7 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఏపీలో వైద్య విద్య ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు నూతనంగా 17 కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా 5 మెడికల్‌ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. రానున్న రెండేళ్లలో మరో 12 కాలేజీలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఎంఎంసీకు ఏపీ గవర్నమెంట్‌ దరఖాస్తు చేసింది. వైఎస్‌ జగన్ ఎన్నికల సమయంలో చెప్పినట్లు జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజీ ఉండేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలకు తయారు చేస్తోంది.

17 మెడికల్ కాలేజీల ద్వారా మొత్తం 2,550 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి కోసం మొత్తం రూ. 8,400 కోట్ల ఖర్చు అవుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడంతో 750 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఏడాదిలో మరో 5 కాలేజీలను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది.

2025-26 నుంచి మరో 7 మెడికల్‌ కాలేజీలుద ప్రారంభం కానున్నాయి. ఇవి కాకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న అనంతపురం, మెడికల్ కాలేజీలో 50, నెల్లూరులో 25, శ్రీకాకుళంలో 25 చొప్పున మరో 100 మెడికల్ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది.

ఇవి కాకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న అనంతపురం మెడికల్ కాలేజీలో 50, నెల్లూరులో 25, శ్రీకాకుళంలో 25 చొప్పున మరో 100 మెడికల్ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది.

Also Read: తెలంగాణలో ఇక రూ.500కే గ్యాస్ సిలిండర్.. రూల్స్ ఇవే?

Advertisment
Advertisment
తాజా కథనాలు