Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. దుద్దుకూరు సమీపంలో రహదారిపై టైర్ పంక్చర్ అయి రాంగ్ రూట్‌లో వచ్చిన ఎర్టిగా కారును మరో ఢీకొట్టింది. By Shiva.K 02 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంక్చర్ కావడంతో రాంగ్ రూట్‌లో వెళ్లిన ఎర్టిగా కారు.. మరో కారును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రెండు కార్లు వేగంగా ప్రయాణిస్తుండటంతో.. ప్రమాద తీవ్రత అధికంగా జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు,19 నెలల చిన్నారి కూడా ఉంది. మరో 8 మందికి తీవ్ర గాయాలవగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా.. ఎక్స్-రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. రేపే నింగిలోకి.. #andhra-pradesh #road-accident #cars-accident-in-andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి