దానివల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది.. అనన్యాపాండే పలు సోషల్‌మీడియా పేజీలను అన్‌ఫాలో చేయడానికిగల కారణాలు వెల్లడించింది నటి అనన్యాపాండే. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైంది. ఇది మానసికంగా మనుషులను బలహీనులను చేస్తుంది. నెగెటివ్ కామెంట్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే తాను మ్యూట్ చేస్తున్నానని చెప్పింది. By srinivas 22 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తన కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ యంగ్ నటి ఎప్పటికప్పుడూ తన ఫ్యాషన్, ఫుడ్, వెకేషన్స్ గురించి అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సోషల్‌మీడియా పేజీలను అన్‌ఫాలో చేసినట్లు చెబుతూ ఇందుకు కారణాలను కూడా వెల్లడించింది. ఈ మేరకు అనన్య మాట్లాడుతూ.. 'ఈ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైంది. ఇది తమపై ఎంత ప్రభావం చూపుతుందో వినియోగదారులకు ఎప్పటికీ అర్థంకాదు. కానీ ఇది మానసికంగా మనుషులను బలహీనులను చేస్తుంది. నా చిన్నతనంలో ఫోన్ల వినియోగం తక్కువ. అందుకే అప్పట్లో ప్రశాంతత ఉండేది. ఇప్పుడు వాటి వినియోగం ఎక్కువైంది. సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్లు కూడా యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాళ్లు చిన్న విషయాలకు కూడా బాధపడుతున్నారు. అలాగే సోషల్‌మీడియాలో కొన్ని పేజీలు ప్రతికూల భావాలను పెంచేలా ఉంటున్నాయి. అలాంటి వాటిని నేను అన్‌ఫాలో, మ్యూట్ చేయడం ప్రారంభించాను. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నా. సెలబ్రిటీని కావడంతో నా చుట్టూ ఎప్పుడూ అభిమానులు ఉంటారు. ఎక్కడకు వెళ్లినా వారు కలుస్తుంటారు. అందుకే రోజులో కొంతసేపైనా ఒంటరిగా ఉంటాను. నా గురించి నేను ఆలోచిస్తుంటా’ అంటూ చెప్పుకొచ్చింది. Also read :బదిరుల పాఠశాలలో ఘోరం.. విద్యార్థికి నిప్పంటించిన స్నేహితులు ఇదిలావుంటే.. సక్సెస్, ప్లాఫ్లతో సంబంధం లేకుండా బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తోంది అనన్య. నెపోటిజం కారణంగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో బాగానే వస్తున్నాయి. ఇటీవలే విజయ్ దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే కొత్త విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసి ధన్‌తేరాస్ రోజే కొత్త ఇంట్లోకి ప్రవేశించిన అనన్య తన నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ మురిసిపోయింది. #social-media #ananya-pande #unfollow మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి