Anant-Radhika Pre Wedding: 'అనంత్‌ని చూసినప్పుడల్లా మా నాన్న ధీరూభాయ్ గుర్తొస్తాడు' ముకేశ్ అంబానీ భావోద్వేగం..!

అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ లో ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. అనంత్‌ను ఎప్పుడు చూసినా ఆయనలో మా నాన్న ధీరూభాయ్‌ కనిపిస్తుంటారని ముకేశ్‌ అంబానీ భావోద్వేగంతో అన్నారు. ఈ రోజు నా తండ్రి ధీరూభాయ్ స్వర్గం నుండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని ముఖేష్ అంబానీ అన్నారు.

New Update
Anant-Radhika Pre Wedding: 'అనంత్‌ని చూసినప్పుడల్లా మా నాన్న ధీరూభాయ్ గుర్తొస్తాడు' ముకేశ్ అంబానీ భావోద్వేగం..!

Anant Ambani - Radhika Pre Wedding: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) రెండవ కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. గుజరాత్ లోని జామ్ నగర్ ఈ ఈవెంట్ కు వేదికైంది. దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రముఖులంతా జామ్ నగర్ లో సందడి చేస్తున్నారు. మూడు రోజులు పాటు జరిగే ఈ ప్రీ వెడ్డింగ్ లో ఎన్నో కార్యక్రమాలు అలరించనున్నాయి. ఇఫ్పటికే బాలీవుడ్ హీరోలతో పాటు ప్రముఖులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖేశ్ కుటుంబం ఈ వేడుకల్లో తళుక్కున మెరిసింది. ఈరోజు రెండో రోజు కూడా ఈ ఈవెంట్ సరికొత్తగా సాగనుంది.

ఈ నేపథ్యంలో మొదటి రోజు ప్రీ వెడ్డింగ్ లో భాగంగా తన కుమారుడు, కాబోయే కోడలిని వేదికమీదకు ఆహ్వానించిన ముఖేశ్ దంపతులు...అనంత్ (Anant Ambani) పై ప్రశంసలు కురిపించారు. అనంత్‌ను ఎప్పుడు చూసినా ఆయనలో మా నాన్న ధీరూభాయ్‌ కనిపిస్తుంటారని ముకేశ్‌ అంబానీ భావోద్వేగంతో అన్నారు.ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు వచ్చిన అతిథులకు ముఖేష్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో అతిథులను అతిథి దేవో భవ అని సంబోధిస్తున్నామని, అంటే అతిథి భగవంతుడిలాంటివాడని అన్నారు.

publive-image

మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ రోజు అనంత్ -రాధిక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారని ముఖేష్ అంబానీ అన్నారు. ఈరోజు నా తండ్రి ధీరూభాయ్ (Dhirubhai Ambani) స్వర్గం నుండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తన ప్రియమైన మనవడు అనంత్ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాన్ని మనం జరుపుకుంటున్నందున అతను ఈ రోజు చాలా సంతోషంగా ఉంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ముఖేశ్ అంబానీ అన్నారు.

Also Read: ఆరు పదుల వయస్సులోనూ తరగని అందం..కొడుకు ప్రీవెడ్డింగ్ లో నీతా అందానికి నెటిజన్లు ఫిదా.!

publive-image

జామ్‌నగర్ మా నాన్నకు, నాకు కర్మ స్థలం, మేము మా లక్ష్యం, అభిరుచి, ఉద్దేశ్యాన్ని గుర్తించిన ప్రదేశం. ముప్పై సంవత్సరాల క్రితం జామ్‌నగర్ బంజరు భూమి, కానీ ఈ రోజు మీరు ఇక్కడ చూస్తున్నది ధీరూభాయ్ కల నిజమైందన్నారు. సంస్కృతంలో అనంత్ అంటే అంతం లేనిదని ముఖేష్ అంబానీ అన్నారు. నేను అనంతంలో అనంతమైన శక్తిని చూస్తున్నాను. అనంత్‌ని ఎప్పుడు చూసినా అతనిలో మా నాన్న ధీరూభాయ్‌ కనిపిస్తారు. అసాధ్యమైనది ఏదీ లేదు అనే మా నాన్నగారి వైఖరి అనంత్‌కు కూడా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు ముఖేశ్ అంబానీ.

Advertisment
Advertisment
తాజా కథనాలు