AmbaniWedding: అంబానీ ఇంటి చిన్న కోడలిగా రాధికా..తొలి ఫోటో నెట్టింట వైరల్‌!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖేష్‌ -నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ..తన ప్రియురాలు రాధిక మర్చంట్ లు వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

New Update
AmbaniWedding: అంబానీ ఇంటి చిన్న కోడలిగా రాధికా..తొలి ఫోటో నెట్టింట వైరల్‌!

Ananth-Radhika: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖేష్‌ -నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ..తన ప్రియురాలు రాధిక మర్చంట్ లు వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఎంతో వేడుకగా నిర్వహించిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అతిథుల ఆశీర్వాదాల మధ్య అనంత్, రాధిక దండలు మార్చుకుని భార్యభర్తలుగా అందరి ముందు నిల్చున్నారు.

ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వరుడు తల్లిదండ్రులు, వధువు తల్లిదండ్రులు అనంత్‌ సోదరి ఇషా అంబానీ పిరమల్‌, అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతో పాటు వధువు సోదరి అంజలి మర్చంట్ మజిథియా తదితర సన్నిహిత కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Also read: కుప్పకూలిన పర్యాటక హెలికాప్టర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు