Anand Mahindra: లండన్‌ లో డబ్బావాలా.. ఆనంద్‌ మహీంద్రా ట్విట్‌ వైరల్‌!

ముంబైలో మొదలైన ఫుడ్ డెలివ‌రీ చేసే డ‌బ్బావాలా విధానం ఇప్పుడు ప‌రాయి దేశానికి కూడా వెళ్లింది. లండ‌న్‌లోని ఓ స్టార్ట‌ప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. అక్క‌డి వారికి స్టీల్ డ‌బ్బాల్లో ఫుడ్ డెలివ‌రీ చేస్తోంది.

New Update
Anand Mahindra: లండన్‌ లో డబ్బావాలా.. ఆనంద్‌ మహీంద్రా ట్విట్‌ వైరల్‌!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డబ్బావాలాలు ఎంత ఫేమస్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. వారిని ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాల్లో ఈ డబ్బావాలా విధానాన్ని మొదలు పెట్టారు కూడా. ఇంటి నుంచి భోజన డబ్బాలను తీసుకుని ఆఫీసుల్లో పని చేసే వారికి డబ్బాలను డెలివరీ చేయడం ఈ డబ్బావాలాలు చేసే పని.

ముంబైలో మొదలైన ఫుడ్ డెలివ‌రీ చేసే డ‌బ్బావాలా విధానం ఇప్పుడు ప‌రాయి దేశానికి కూడా వెళ్లింది. లండ‌న్‌లోని ఓ స్టార్ట‌ప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. అక్క‌డి వారికి స్టీల్ డ‌బ్బాల్లో ఫుడ్ డెలివ‌రీ చేస్తోంది. ప‌న్నీర్ స‌బ్జీ, మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ వంటి భార‌తీయ వంట‌కాల‌ను రుచి చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా త‌న ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

రివ‌ర్స్ కాల‌నైజేష‌న్ అవుతుంద‌ని చెప్ప‌డానికి ఇంతకంటే బెట‌ర్ ఎవిడెన్స్ లేద‌ని పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

Also read: టీఎస్ ఈఏపీసెట్‌… గోరింటాకు.. టాటూలు వేసుకోవద్దు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్..పెద్ద కంపెనీలన్నీ ఢమాల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు అన్ని దేశాల మీద వరుస బాంబ్ లు వేశాయి. దాంతో పాటూ తన సొంత దేశాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. టారీఫ్ ల దెబ్బకు వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ మొదలైంది.

New Update
usa

Blood Bath

ట్రంప్ టారీఫ్ ల మోతకు ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. నిన్న దాదాపు అన్ని దేశాల మీదనా ట్రంప్ కొత్త టారీఫ్ లను విధించారు. దీని దెబ్బకు దాదాపు అన్ని దేశాల్లో షేర్ మార్కెట్ షేక్ అయింది.   ఈరోజు భారత స్టాక్ మార్కెట్ కూడా దడదడలాడింది. ఘోరంగా షేర్లు పతనం అయ్యాయి. బంగారం ధర మరింత పెరిగింది. ఒక్క ఫార్మా తన్ని మిగతా అన్ని రంగాల షేర్లూ అతలాకుతలం అయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల పరిస్థితీ అలానే ఉంది. ఇప్పుడు అమెరికా వాల్ స్ట్రీట్ వంతు.

బ్లడ్ బాత్..

ఈరోజు మొదలవ్వడమే అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని షేర్లూ ఎర్ర రంగు పులుముకున్నాయి. ప్రతీకార సుంకాల మూలంగా వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వినట్లు అవ్వడమే కాకుండా.. అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇది అమెరికా మార్కెట్ ను దెబ్బ తీస్తోంది. దీని కారణంగా ప్రధాన సూచీలన్నీ భారీగా పతనం అయ్యాయి. ఉదయం 10 గంటలకు డౌజోన్స్‌ 1500 పాయింట్లకు పైగా నష్టంతో 40,665 వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ దాదాపు 5 శాతం మేర క్షీణించగా.. ఎస్‌అండ్‌పీ 500 4 శాతం కుంగింది. అమెరికాలో పెద్ద షేర్లు అని చెప్పుకునే నైకీ 12 శాతం, యాపిల్ 9 శాతం తో నష్టాల్లో నడుస్తున్నాయి. ఐఫోన్లకు ప్రధన సప్లయర్ చైనా..ఆ దేశానికి 54 శాతం సుంకాలు విధించడంతో ఐఫోన్ల సప్లయ్ కు ఆటంక ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. 2020 తర్వాత యాపిల్‌ స్టాక్‌ ఈ స్థాయిలోపతనం కావడం ఇదే తొలిసారి. వీటిో పాటూ టెస్లా, అమెజాన్, మెటా లాంటి మిగతా ప్రధాన షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | stock-market 

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

Advertisment
Advertisment
Advertisment