Watch Video: దోమల బెడద.. పరిష్కారం చూపించిన ఆనంద్ మహీంద్రా

ముంబయిలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలను చంపే పరికరాన్ని ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో షేర్ చేశారు. చైనా వ్యక్తి తయారు చేసిన ఈ పరికరం దోమలను వెతికి పట్టుకొని చంపుతోందని తెలిపారు. ఇది మీ ఇంటికి ఐరన్‌డోమ్‌లా పనిచేస్తుందని రాసుకొచ్చారు.

New Update
Watch Video: దోమల బెడద.. పరిష్కారం చూపించిన ఆనంద్ మహీంద్రా

వర్షకాలం వచ్చిందంటే చాలు.. దొమల బెడత విపరీతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా డెంగీ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దోమల నివారణకు స్థానిక యంత్రాంగ చర్యలు తీసుకున్నప్పటికీ ఇది పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కూడా ఈ సమస్య ఉంది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో స్పందించారు. దోమలను చంపే ఓ పరికరానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీన్ని ఆయన 'మీ ఇంటికి ఇది ఐరన్‌డోమ్‌ లాంటిద'ని పేర్కొన్నారు.

Also Read: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. తెలుగు నేతలకు కీలక బాధ్యతలు

'' ముంబయిలో డెంగీ కేసులు పెరుగుతున్న క్రమంలో.. ఈ చిన్నపాటి ఫిరంగీని ఎలా పొందాలనే దానిపై ప్రయత్నిస్తున్నాను. చైనా వ్యక్తి తయారు చేసిన ఈ పరికరం.. దోమలను వెతికి పట్టుకుని చంపేస్తుంది. ఇది మీ ఇంటికి ఐరన్‌డోమ్ లాంటిదంటూ '' రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో గమనిస్తే.. ఆ పరికరాన్ని ఓ ఇంట్లోని గదిలో పెట్టారు. దాని బాడీ రౌండ్‌గా తిరుగుతూ దోమలను పట్టుకొని చంపేస్తోంది.

ఈ పరికరం యాంటీ-మిసైజ్ డిఫెన్స్‌ సిస్టమ్‌ను పోలిఉంది. ఇందులో ఓ రాడర్ వ్యవస్థను కూడా అమర్చారు. ఇది చుట్టుపక్కల ఉన్న దోమలను వెంటనే గుర్తిస్తుంది. ఆ తర్వాత దీనిలో ఉన్న లేజర్‌ పాయింటర్‌ దోమలను చంపేస్తుంది. అయితే ఈ వీడియోను 2023, డిసెంబర్‌లో చైనీస్‌ మైక్రోబ్లాగింగ్ సైట్‌ విబోలో షేర్ చేశారు. ఓ వ్యక్తి తన ఎలక్ట్రిక్ కారులో ఉన్న రాడర్‌ను కాస్త మార్చేసి ఈ పరికరాన్ని తయారుచేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అయితే ఇప్పుడు ఆనంద్‌ మహీంద్రా దీన్ని మళ్లీ షేర్ చేయడంతో మరోసారి వైరల్‌ అవుతోంది.

Also Read: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్‌.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేాడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.  

New Update
ipl

Abhishek Sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు వరుస నాలుగు మ్యాచ్‌ల ఓటమి తర్వాత విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి రికార్డులు సృష్టించాడు. కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేయగా.. అందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. అయితే ఇది ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా కూడా అభిషేక్ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

IPLలో అత్యధిక స్కోర్లు

175- క్రిస్ గేల్ (RCB) vs PWI, 2013
158- బ్రెండన్ మెకల్లమ్ (KKR) vs RCB, 2008
141- అభిషేక్ శర్మ (SRH) vs PBKS, 2025
140- క్వింటన్ డి కాక్ (LSG) vs KKR, 2022
133- AB డివిలియర్స్ (RCB) vs MI, 2015

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment