Anakapalle: 'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది'.. యువగళం పాదయాత్రపై వైసీపీ నేత కౌంటర్లు.!

నారా లోకేష్ యువగళం పాదయాత్రపై కౌంటర్లు వేశారు అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్. యువగళం పాదయాత్ర కామెడీ యాత్ర అని ఎద్దెవ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగన్ పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని చురకలు వేశారు.

New Update
Anakapalle: 'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది'.. యువగళం పాదయాత్రపై వైసీపీ నేత కౌంటర్లు.!

Anakapalle: అనకాపల్లి జిల్లాలో అధికార పార్టీ వైసీపీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై విమర్శలు గుప్పించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ యువగళం పాదయాత్రపై చురకలు వేశారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కామెడీ యాత్ర అని బొడ్డేటి ప్రసాద్ ఎద్దెవ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగన్ పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదం ఉందని కౌంటర్లు వేశారు.

Also Read: కదిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్..!

జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు గ్రామాల్లో ప్రజల అవస్థలు తెలుసుకుని మేనిఫెస్టో విడుదల చేసారని ఆయన కామెంట్స్ చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోని మాట తప్పకుండా అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ఈసారి కూడా ప్రజలు సీఎంగా జగన్నే ఎన్నుకుంటారని ధీమ వ్యక్తం చేశారు. జగన్ సీఎంగా అధికారంలోకి వచ్చాకే ప్రజలు సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యనించారు.

Also Read: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!

ఈ క్రమంలోనే విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా మీరు స్వాగిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీకి ఉందని బొడ్డేటి ప్రసాద్ అన్నారు. గతంలో బి.సి.లను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ పదవిలోకి వచ్చిన తర్వాత బి.సి.లకు ఏమి చేసారు? అని ప్రశ్నించారు. ఆర్థిక రాజధానిగా విశాఖ వస్తే నిరుదోగ్య సమస్య తీరుతుందని యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఉత్తరాంధ్ర దోహీ టీడీపీ అధినేత చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఇంటికి ఒక ఉద్యోగం..డ్వాక్రా రుణాలు మాఫీ అని గంతో మోసం చేశారని..ఇప్పుడు మళ్లీ ప్రజలను పాదయాత్రతో మోసం చేసేందుకు వచ్చారని దుయ్యబట్టారు. టీడీపీ పార్టీకే భవిష్యత్తు లేదు..అలాంటిది భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ అని మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్టీకి బలం లేకపోవడంతోనే జనసేన పార్టీని దత్తతకు తీసుకుంటునారని మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు