ఎయిర్‌షో చూసేందుకు వెళ్లారు..అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా..!!

భారత వైమానిక దళం యొక్క ఎయిర్‌షో సందర్భంగా భోపాల్‌లోని ఖాను గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రదర్శనను చూడటానికి స్ధానిక ప్రజలు ఎంతో ఆసక్తితో తరలి వచ్చారు. అయితే, కొందరు యువకులు అతి ఉత్సహంతో ఎయిర్ షో చూసేందుకు అక్కడే ఉన్న ఓ రేకుల షెడ్‌పైకి ఎక్కారు. అంతా ఆసక్తిగా ఎయిర్ షో చూస్తున్న సమయంలో ఆ రేకుల షెడ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు అయ్యారు.

New Update
ఎయిర్‌షో చూసేందుకు వెళ్లారు..అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా..!!

Bhopal: భారత వైమానిక దళం యొక్క ఎయిర్‌షో సందర్భంగా భోపాల్‌లోని ఖాను గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రదర్శనను చూడటానికి వచ్చిన స్ధానిక ప్రజలు అక్కడే ఉన్న ఓ రేకుల షెడ్‌పైకి ఎక్కారు. అంతా ఆసక్తిగా ఎయిర్ షో చూస్తున్న సమయంలో ఆ రేకుల షెడ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక పెద్ద పెద్దగా అరిచారు. కాగా, ఎక్కువ మంది దానిపైకి ఎక్కడంతో షెడ్ పైకప్పు  ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో చాలా మంది కింద పడి గాయపడ్డారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత వైమానిక దళం (IAF) తన 91వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని భోజ్‌తాల్ సరస్సుపై వైమానిక ప్రదర్శనను నిర్వహించింది. దేశం యొక్క వైమానిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ నగరాన్ని థ్రిల్లింగ్ ఏరోబాటిక్ ప్రదర్శనలతో అలరించింది. భారత వైమానిక దళానికి చెందిన CH-47F (I) చినూక్ హెలికాప్టర్లు సరస్సుపై ఉత్కంఠ భరితమైన వైమానిక ప్రదర్శనలను ప్రదర్శించాయి.  65 యుద్ధ విమానాలు ఆకాశంలో దూసుకుపోతున్నాయని స్ధానిక ప్రజలు ఎంతో ఆసక్తితో చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  అయితే, అక్కడ ఎక్కువ మంది ఉండడంతో కొందరూ యువకులు పక్కనే ఉన్న రేకుల షెడ్డుపైకి ఎక్కారు. అయితే, ఆ రేకుల షెడ్ అందరి బరువు మోయాలేక విరిగి పడింది. దీంతో దానిపైన ఉన్న చాలా మంది కిందపడి గాయపడ్డారు. కాగా, అందరు పెద్దగా అరవడంతో ఎయిర్ షో ప్రదర్శన కన్న ఈ ఘటన కాస్తా వైరల్ గా మారింది.

Also Read: ఆర్బీఐ గుడ్ న్యూస్.. 2 వేల నోట్ల విషయంలో కీలక ప్రకటన..

Advertisment
Advertisment
తాజా కథనాలు