బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన 11 నెలల పాప గుండెను..ఎడాది చిన్నారికి విజయవంతంగా అమర్చిన వైద్యులు!

బ్రెయిన్ డెడ్ అయిన 11 నెలల పాప గుండెను ఏడాది చిన్నారికి విజయవంతంగా అమర్చిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.ప్రస్తుతం చిన్నారి అవయవాలు దానం చేసిన పాప తల్లిదండ్రులపై ప్రశంసలు వస్తున్నాయి.

New Update
బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన 11 నెలల పాప గుండెను..ఎడాది చిన్నారికి విజయవంతంగా అమర్చిన వైద్యులు!

కోయంబత్తూరుకు చెందిన శరవణన్ ఓ ప్రైవేట్ కంపెనీలో, అతని భార్య ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. వారి 11 నెలల కుమార్తె కుర్చీపై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

4 రోజులుగా చిన్నారికి అక్కడ చికిత్స అందుతుండగా చిన్నారి ఆదిరా బ్రెయిన్ డెత్ కు గురైంది. ఈ సమాచారం విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉండగా.. చిన్నారి శరీర అవయవాలను దానం చేయడంపై వైద్యులు వివరించారు. పాప తల్లి నర్సు కావడంతో ఆమె కూడా అంగీకరించడంతో బిడ్డ అవయవాలను దానం చేసేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

అనంతరం బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారి గుండె, కిడ్నీని తీసుకున్నారు. ఈ కేసులో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఎడాది చిన్నారికి గుండె ఆవశ్యకత ఉందని తేలింది. కోయంబత్తూరుకు చెందిన వైద్యులు చెన్నైకి చెందిన వైద్యులను సంప్రదించి సమాచారం అందించారు.అనంతరం 11 నెలల చిన్నారి గుండెను కోయంబత్తూరు నుంచి చెన్నైకి తరలించి ఏడాది చిన్నారికి విజయవంతంగా గుండెను అమర్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు