Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ కంట్రిబ్యూటర్లలో తెలుగువాళ్లే టాప్.. లిస్ట్ ఇదే!

ఎలక్టోరల్ బాండ్ కంట్రిబ్యూటర్లలో తెలుగువాళ్లే టాప్ టెన్ లో ఉన్నట్లు వెల్లడైంది. విరాళాలు అందించిన లిస్టులో మేఘా కంపెనీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. విరాళాలు అందుకున్న వారిలో బీఆర్ఎస్ 4, వైసీపీ 7, టీడీపీ 8వ స్థానంలో నిలిచాయి. యశోద, అరబిందో, మై హోమ్ లు కూడా ఉన్నాయి.

New Update
BIG BREAKING: రాజకీయ పార్టీలు, దాతల మధ్య లింకులను బయటపెట్టండి.. ఎలక్టోరల్ బాండ్ డేటాపై సుప్రీం ఆదేశాలు!

Telugu Companies Tops in Electoral Bonds List: ఎన్నికల నిధులు భారీగా సమకూర్చిన వారిలో హైదరాబాద్ నుంచి ఇన్‌ఫ్రా, రియాల్టీ, ఫార్మా సంస్థలు ఉన్నట్లు బయటపడింది. ఎన్నికల సంఘం గురువారం బహిరంగపరిచిన జాబితాలో హైదరాబాద్‌కు చెందిన టాప్ ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, మౌలిక సదుపాయాల సంస్థలు, రియల్టర్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు అత్యధికంగా సహకరించినట్లు వెల్లడైంది.

అతిపెద్ద కంట్రిబ్యూటర్..
TOI కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డేటాను న్యాయస్థానం విశ్లేషించింది. ఇందులో కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు కూడా ఈ జాబితాలో భాగమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా అనేక నీటిపారుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసిన మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎలక్టోరల్ బాండ్‌లకు రూ.966 కోట్లను అందించింది. దీంతో దేశంలో రెండవ అతిపెద్ద కంట్రిబ్యూటర్ కంపెనీగా నిలిచింది.

ఫార్మా దిగ్గజాలు..
యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాండ్‌లకు రూ. 162 కోట్లను అందించింది. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సుమారు రూ. 80 కోట్లు, నాట్కో ఫార్మా రూ. 70 కోట్లు విరాళంగా అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నవయుగ ఇంజినీరింగ్ రూ.66 కోట్లు అందించింది. అరబిందో ఫార్మా సుమారు రూ. 50 కోట్లు, హెటెరో డ్రగ్స్ సుమారు రూ. 69 కోట్లు అందించాయి. MSN ఫార్మా గ్రూప్ దాదాపు రూ. 38 కోట్లు ఇవ్వగా, గ్రీన్‌కో, రాజపుష్ప రెండూ ఒక్కొక్కటి రూ. 35 కోట్లు అందించాయి. హైదరాబాద్‌లోని అతిపెద్ద బిల్డర్‌లలో ఒకటైన మై హోమ్ గ్రూప్ దాదాపు రూ. 20 కోట్ల విరాళాన్ని అందించినట్లు జాబితా పేర్కొంది. మిగతా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు రూ.10 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు. గుళ్లపల్లి కోటేశ్వరరావు, పొనుగోటి హేమేందర్‌రావు, మందాడి రాములు పప్పిరెడ్డి కిషోర్‌కుమార్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామాంజనేయరెడ్డి, సంగిరెడ్డి తిరుపతిరెడ్డి, స్వప్న చెన్నవరం, పి శివ శంకరరెడ్డి, పోలిన జ్ఞానేశ్వర్‌రావు తదితరులు ఇందుకు సహకరించారు.

ఇది కూడా చదవండి: Megha Bonds Row: సరిగ్గా ఆ ప్రాజెక్ట్‌ డీల్‌కు ముందే రూ.140 కోట్ల ఎలక్టోరల్ బాండ్‌ను కొనుగోలు చేసిన మేఘ!

బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ..
2014లో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత దశాబ్ద కాలం పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ 2017 నుంచి 23 వరకు రూ. 913 కోట్లతో ఎలక్టోరల్ బాండ్ విరాళాలను అందుకోగా పార్టీల పరంగా దేశంలో నాల్గవ స్థానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ. 382 కోట్లతో దేశంలోనే ఏడో స్థానంలో నిలిచింది. 147 కోట్లతో టీడీపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2017-18 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 దశల్లో హైదరాబాద్, విశాఖపట్నం సహా 29 శాఖలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎలక్టోరల్ బాండ్లను విక్రయించినట్లు వెల్లడైంది.

ఈ మేరకు ఏప్రిల్ 2019 నుంచి జనవరి 2024 వరకు SBI ఎలక్టోరల్ బాండ్ విరాళాలను వెల్లడించిగా ఇందుకు సంబంధించి తెలుగు వారి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్ర, తెలంగాణ కంపెనీలు:
మేఘా ఇంజినీరింగ్
నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ
డాక్టర్ రెడ్డీస్ లేబరేటొరీస్
నాట్కో ఫార్మా
ఎన్సీసీ లిమిటెడ్
అరబిందో ఫార్మా
రాజపుష్ప
ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్
హెటిరో డ్రగ్స్
శ్రీ చైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్
గ్రీన్ కో
సన్ బోర్న్ ఎనర్జీ
ఎన్ఎస్ఎల్ సెజ్ హైదరాబాద్
రామ్కో సిమెంట్స్
సోమశిల సోలార్ పవర్
కమల్ ట్రేడింగ్ కార్పొరేషన్
వంశీరాం బిల్డర్స్
దివీస్ లేబొరేటరీస్
సాగర్ సిమెంట్స్
వి బాలవీరయ్య సన్స్
బయోలాజికల్ ఈ
బుట్టా హాస్పిటాలిటీస్
సియెంట్ లిమిటెడ్
అపర్ణా ఫామ్స్
కల్పతరు
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్
భారత్ బయోటెక్.
రిత్విక్ ప్రాజెక్ట్స్
ఆంధ్ర, తెలంగాణ వ్యక్తులు
పెద్దిరెడ్డి రామాంజనేయ రెడ్డి
పప్పిరెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి
సంగిరెడ్డి తిరుపతి రెడ్డి
చెన్నవరం స్వప్న
పి శివ శంకర రెడ్డి
పోలిన గణేశ్వర రావు
జోస్యుల వెంకటేశ్
గోరుకంటి రవీందర్ రావు
కోనేరు రవితేజ
కుందూరు పవన్ కుమార్ రెడ్డి
పి తేజవర్ధన్ రెడ్డి
బండి రవీంద్రనాథ రెడ్డి
వీరా రవీంద్ర
మండవ ప్రభాకర రావు
కౌకుంట్ల వేణుగోపాల్
చండక సన్యాసి రావు
ముప్పన వెంకట రావు
గుఱ్ఱం మౌనిక
గుఱ్ఱం రవి
ఆల రామాంజనేయులు
బైరపనేని శివార్జున రావు
గంగదాసు బసివి రెడ్డి
గౌరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి
ఎన్వీ సుబ్బా రావు
ఇందూరు సుధాకర రెడ్డి
వల్లూరుపల్లి ప్రభు కిషోర్

ఎన్నికల సంఘం ప్రచురించిన దేశవ్యాప్త వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి: 

Advertisment
Advertisment
తాజా కథనాలు