Amit Shah: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతపై అమిత్ షా కీలక సమావేశం

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలను అంచనాపై సమీక్ష చేయనున్నారు. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, సైన్యాధికారులు హాజరు కానున్నారు.

New Update
Amit Shah: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతపై అమిత్ షా కీలక సమావేశం

Amit Shah Meeting on J&K Security: అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి, రాబోయే అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలను అంచనా వేయడానికి అధికారులతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. కాగన్

శుక్రవారం, అమిత్ షా జాతీయ రాజధానిలో సీనియర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అధికారులతో J&K లో పరిస్థితిని చర్చించడానికి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు . ఆ తర్వాత సమస్యను పరిష్కరించేందుకు జూన్ 16న మరో వివరణాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల (Terror Attack) నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంత శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళనలు రేకెత్తించిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో, జూన్ 16న నార్త్ బ్లాక్‌లో మరోసారి వివరణాత్మక సమావేశం నిర్వహించాలని హోంమంత్రి ఆదేశించారు. హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర హోం కార్యదర్శి,జమ్మూ - కాశ్మీర్ పరిపాలన, MHA సీనియర్ అధికారులు పాల్గొంటారు.

Also Read: అమరావతి పూర్తయ్యేది అప్పుడే.. మంత్రి నారాయణ కీలక ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు