Amit Shah: రెండేళ్లలో పోలవరం పూర్తి.. అమరావతి రాజధాని.. అమిత్ షా కీలక హామీలు ఏపీలో ధర్మవరంలో కూటమి అభ్యర్థుల తరపున కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి.. అమరావతి రాజధాని వంటి హామీలను అమిత్ షా ఇచ్చారు. By KVD Varma 05 May 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఏపీలో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah)ధర్మవరంలో కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక తెలుగు భాషను పరిరక్షించడం తమ బాధ్యత అని చెప్పారు అమిత్ షా. వైసీపీ సర్కారు తెలుగు భాషను నిర్వీర్యం చేసే దిశలో వెళుతోందని.. తెలుగు భాషను దెబ్బతీసేందుకే ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనా ప్రారంభించిందని ఆరోపించిన అమిత్ షా(Amit Shah).. తెలుగు భాషను పరిరక్షించేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. గూండాగిరీ, అవినీతి అంతం చేయడానికే ఏపీలో పొత్తులు కుదుర్చుకున్నామని అమిత్ షా అన్నారు. ఏపీలో గూండాగిరీని అంతం చేస్తామని అన్నారు. ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకున్నామనే విషయాన్నీ అమిత్ షా ధర్మవరం సభలో వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయాలనే తాము పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు అమిత్ షా. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి చెప్పిన అమిత్ షా.. పోలవరానికి జాతీయ హోదా కల్పించడంలో బీజేపీదే కీలకపాత్ర అని వివరించారు. కేవలం జగన్ అవినీతిలో కూరుకుపోయి పోలవరం నిర్మాణం జాప్యం కావదానికి కారణం అయ్యారని ఈ సందర్భంగా అమిత్ షా ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంటే పోలవరం రెండేళ్లలో పూర్తి చేస్తా అని అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారు. Also Read: అమేథీని కాదని రాయ్‌బరేలీ.. రాహుల్..అక్కడే ఎందుకు? అయోధ్య రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా అడ్డుకుందని అమిత్ షా అన్నారు. మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాతే రామమందిరానికి పవిత్రత చేకూరిందని.. రామ మందిర ప్రతిష్ట జరిగిందనీ ఆయన వెల్లడించారు. రామమందిర ప్రతిష్ఠకు రాహుల్, జగన్‌లను ఆహ్వానించాంమని చెప్పారు. ఆ కార్యక్రమానికి హాజరు కాని జగన్ కు, రాహుల్ కు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు అమిత్ షా. ఇక జాతీయ స్థాయిలో తాము చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా అమిత్ షా చెప్పుకొచ్చారు. అమిత్ షా ప్రసంగంలో మరిన్ని.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నాం భారత కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పండి భారత్ కూటమిలో చేరితే శరద్ పవార్ ప్రధాని అవుతారా? భారత్‌తో పొత్తు కుదిరితే మమత, స్టాలిన్ ప్రధానులు అవుతారా? భారత్‌తో పొత్తు కుదిరితే రాహుల్ గాంధీని ప్రధానిగా నియమిస్తారా? భారత కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరూ లేరు మోదీ మూడోసారి ప్రధాని అవుతారు దేశాన్ని కాపాడాలంటే మోదీని మళ్లీ ప్రధానిగా నియమించాలి ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టాలంటే మోదీని మళ్లీ ప్రధానిగా నియమించాలి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మోదీ ప్రధాని కావాలి 10 కోట్ల మందికి ఉచిత విద్యుత్ అందితే మోదీ మళ్లీ ప్రధాని కావాలి శ్రీరాముడు మరియు జటాయువును కలిసిన పంజాభూమి లేకషి ప్రాణం లోక్‌సభ ఎన్నికలు రెండు దశల్లో పూర్తయ్యాయి తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో మోదీ వంద పరుగులు తదుపరి దశలో 400 సీట్లకు పైగా సాధిస్తాం #amit-shah #ap-assembly-elections-2024 #dhramavaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి