Mary:మళ్లీ మోడీ కావాలని అమెరికన్లు కోరుతున్నారు.. సింగర్ మేరీ కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాని మోడీపై అమెరికన్‌ సింగర్ మేరీ మిల్బెన్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. మళ్లీ ఆయనే భారత ప్రధాని కావాలని అమెరికన్లు కోరుతున్నట్లు తెలిపారు. భారత్‌కు ఆయనే అత్యుత్తమ నాయకుడని, ఆయనుంటేనే అమెరికాతో సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు.

New Update
Mary:మళ్లీ మోడీ కావాలని అమెరికన్లు కోరుతున్నారు.. సింగర్ మేరీ కీలక వ్యాఖ్యలు

Mary Milliben: భారత ప్రధాని మోడీ (PM Modi)పై అమెరికన్‌ సింగర్ మేరీ మిల్బెన్‌ (Mary Milliben) మరోసారి ప్రశంసలు కురిపించారు. గతేడాది జూన్‌లో మోడీ అమెరికా పర్యటనలో భాగంగా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించి ఔరా అనిపించిన మేరీ.. ప్రధాని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని  భారతీయుల మనసులు గెలుచుకుంది. అయితే రీసెంట్ గా మోడీ గురించి మాట్లాడిన ఆమె.. మోడీ అత్యుత్తమ నాయకుడని, అమెరికాతో సంబంధాలు బలపడటానికి ఆయనే ప్రధాన కారణమన్నారు.

అమెరికన్లు కోరుకుంటున్నారు..
ఈ మేరకు మేరీ మాట్లాడుతూ.. ప్రధానిగా మళ్లీ మోడీ రావాలని అమెరికన్లు కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. ఆయన ఎన్నికతోనే ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు. ‘భారత ప్రధాని మోడీకి అమెరికాలో భారీ మద్దతు ఉంది. మళ్లీ ఆయనే మరోసారి ప్రధానిగా ఎన్నిక కావాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. 2024 ఎన్నికలు ఇరు దేశాలకూ కీలకం. వీటి ఫలితాలు భారత్‌-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపుతాయి' అని మేరీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి

బాధ్యత మనదే..
అలాగే ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే నాయకులను ఎన్నుకునే బాధ్యత మనదే. భారత్‌ను ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు మోడీ కృషి చేశారు. ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో భారత్‌ పురోగతి సాధించింది. దేశాధ్యక్షురాలిగా, కేంద్ర మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇచ్చి వారి నాయకత్వాన్ని ప్రోత్సహించారు. అమెరికాకు సంబంధించినంత వరకు ఆయన గొప్ప నాయకుడు. భారత్‌లో మోడీకి పోటీ లేదు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన మరోసారి ప్రధానిగా ఎన్నికవుతారనే నమ్మకం ఉందని మేరీ ‌చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు