/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-4-4.jpg)
American Mountaineer : రీసెంట్‌గా అమెరికా (America) కు చెందిన ఓ పర్వతారోహకుడి మృతదేహం పెరూ దేశంలోని హుస్కరన్ పర్వతం మీద లభించింది. అమెరికాకు చెందిన విలియం స్టాంప్‌ఫ్ల్ (William Stampfl) అనే 59 ఏళ్ల వ్యక్తి పర్వతారోహణ కోసం 2002లో పెరూ (Peru) లోని హుస్కరన్ పర్వతం వద్దకు చేరుకున్నాడు. 6700 మీటర్లు అంటే 22 వేల అడుగుల ఎత్తైన పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించిన విలియం స్టాంప్‌ఫ్ల్.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. తోటి పర్వతారోహకులు, పోలీసులు ఎంత గాలించినా విలియం ఆచూకీ దొరకలేదు. అతని కోసం అతని కుటుంబ సభ్యులు వెతికి వెతికి అలిసిపోయారు. ఇక ఎప్పటికీ దొరకదని నిర్ణయించుకుని వదిలేశారు.
ఇప్పుడు 22 ఏళ్ళ తర్వాత హుస్కరన్ పర్వతం (Huascaran Mountain) మీద వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా విలియం మృతదేహం లభ్యం అయింది. ఆ కొండ మీద పేరుకున్న మంచు కరగడంతో అతని మృతదేహం బయటపడిందని పోలీసులు చెప్పారు. అయితే దీన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే 22 ఏళ్ళ తరువాత కూడా విలియం బట్టలు కానీ, బాడీ కానీ చెక్కు చెదరలేదు. అతని శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అలాగే ఉంది. విలియం వేసుకున్న బట్టలు, షూ, పాస్‌పోర్టు కూడా అలాగే ఉంది. ఈ క్రమంలోనే పాస్‌పోర్టులో ఉన్న వివరాల ఆధారంగా విలియం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
పెరూలో ఉన్న పర్వతాలను అధిరోహించేందుకు దేశ, విదేశాల నుంచి పర్వతారోహకులు వెళ్తూ ఉంటారు. ఈశాన్య పెరూలో హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను ఎక్కువమంది అధిరోహిస్తారు. అయితే ఈ క్రమంలో చాలా మంది మృత్యువాతను కూడా పడుతుంటారు. అక్కడ చాలా అధికంగా మంచు ఉండడం ఒక కారణం. పర్వతం ఎక్కే క్రమంలో అక్కడి వాతావరణానికి తట్టుకోలేకపోవడం, అదుపు తప్పి పడిపోవడం, మంచులో కూరుకుపోవడంలాంటి సంఘటనల వల్ల చాలా మంది చనిపోతుంటారు. రీసెంట్‌గా
ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ.. అక్కడి వాతావరణం తట్టుకోలేక మృత్యువాత పడ్డారు.
Also Read:USA: వాషింగ్టన్‌లో మొదలైన నాటో సమావేశాలు..జో బైడెన్‌పై పెరుగుతున్న అసమ్మతి
India-China: ట్రంప్ టారిఫ్ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు
ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.
Jai shankar
ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్
ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్‌ల స్పందించారు. అమెరికా టారిఫ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు.
Also read: Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
telugu-news | rtv-news
Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...
Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
Marriage: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్..