Ambani Wedding: అనంత్, రాధికల పెళ్ళికి ముందు.. ముఖేష్- నీతా అంబానీల ప్రత్యేక కార్యక్రమం..?

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జులై 12న ఘనంగా జరగనుంది. ఈ శుభకార్యానికి ముందు అంబానీ కుటుంబం నిరుపేదల సామూహిక వివాహాలను నిర్వహించనుంది. జూలై 2న సాయంత్రం 4.30 గంటలకు పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యా మందిర్ లో సామూహిక వివాహాలు జరగనున్నట్లు సమాచారం.

New Update
Ambani Wedding: అనంత్, రాధికల పెళ్ళికి ముందు.. ముఖేష్- నీతా అంబానీల ప్రత్యేక కార్యక్రమం..?

Ambani Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ (Anant Ambani)పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ (Radhika Merchant) వివాహం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ నేపథ్యంలో జులై 2 నుంచి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అనంత్, రాధికా పెళ్లి ఆహ్వాన పత్రికలను అతిథులకు అందించడం ప్రారంభించారు. ఇటీవలే నీతా అంబానీ (Nita Ambani) కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ మొదటి శుభలేఖను ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.

అనంత, రాధికా పెళ్ళికి ముందు సామూహిక వివాహాలు

అయితే అనంత్, రాధికా వివాహానికి ముందు అంబానీ కుటుంబం నిరుపేదల సామూహిక వివాహాలను నిర్వహించబోతున్నట్లు సమాచారం. అనంత్ అంబానీ, రాధికా ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో భాగంగా జూలై 2న సాయంత్రం 4.30 గంటలకు పాల్ఘర్లోని స్వామి వివేకానంద విద్యా మందిర్ లో ముఖేష్- నీతా అంబానీలు నిరుపేదల సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు పలు వార్తా నివేదికలు తెలిపాయి.

Anant Ambani Wedding

జులై 12 వివాహ వేడుకలు, జులై 13న శుభప్రదమైన ఆశీర్వాదాల వేడుక, 14న వెడ్డింగ్ రిసెప్షన్ ఉండబోతున్నట్లు సమాచారం. వెడ్డింగ్ డ్రెస్ కోడ్ భారతీయ సంప్రదాయంలో ఉండబోతుంది. అనంత్, రాధికా వెడ్డింగ్ కార్డు పై ఉన్న ఆలయం బొమ్మ నిజమైన వెండితో చేయబడింది. దానిపై అందమైన శిల్పాలు కూడా చేయబడ్డాయి.

Also Read: Kalki 2898 AD: 'కల్కి' ఊచకోత.. రెండో రోజు కలెక్షన్లు చూస్తే పూనకాలే! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు