Annamalai: అంబానీ-అదానీ అనేది కాంగ్రెస్‌కు మురికి పదం.. అన్నామలై కీలక వ్యాఖ్యలు 2019 నుంచి పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తోందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోందని, అంబానీ-అదానీ అనేది ఆ పార్టీకి మురికి పదమని అన్నారు. By V.J Reddy 09 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Tamil Nadu BJP chief Annamalai: దేశంలో పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ దుమ్మెత్తిపోసిందని, అంబానీ-అదానీ అనేది ఆ పార్టీకి మురికి పదమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు. అంబానీ, అదానీలతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన నేపథ్యంలో అన్నామలై ఈ వ్యాఖ్యలు చేశారు. ALSO READ: మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్ష ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కథనం నడుపుతోందని ఆరోపించారు. మీరు (కాంగ్రెస్) ఇంతకాలం దుమ్మెత్తి పోస్తున్న పారిశ్రామికవేత్తల నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో ఇప్పుడు చెప్పండి అని ప్రధాని మోదీ అడుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ మైండ్‌సెట్‌లో, పారిశ్రామికవేత్తలు అక్రమంగా డబ్బు సంపాదిస్తారని ఉందని ఎద్దేవా చేశారు. అంబానీ-అదానీ అనే పదం కాంగ్రెస్ పార్టీకి మురికి మాట అని పేర్కొన్నారు. వారు పారిశ్రామికవేత్తల నుండి ఎంత డబ్బు తీసుకున్నారో మాకు చెప్పాలి? అని అన్నారు. కాగా.. బుధవారం, తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలపై దాడి చేయడం ఎందుకు ఆపివేసిందని ప్రశ్నించారు. ఆ పార్టీ అంబానీ-అదానీలతో ఒప్పందం కుదుర్చుకుందా అనే ప్రశ్నను లేవనెత్తరు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తల నుంచి కాంగ్రెస్ పార్టీకి టెంపో లోడ్‌ల నల్లధనం వచ్చిందా అని నిలదీశారు. గత కొంత కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీకి డబ్బులు సంపాదించడం కోసమే పనిచేస్తోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ప్రధాని మోదీ ఇలా కౌంటర్ ఇచ్చారు. #congress #annamalai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి