Green Peas : గ్రీన్‌ పీస్‌ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!

పచ్చి బఠానీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర కండరాలకు కూడా గ్రీన్‌ పీస్‌ మంచివి. రక్తపోటును నియంత్రించడంతో పాటు మలబద్ధకం సమస్యలకు పచ్చి బఠానీలు చెక్‌ పెడతాయి.

New Update
Green Peas : గ్రీన్‌ పీస్‌ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!

Green Peas Benefits : పచ్చి బఠానీలు(Green Peas) తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ చిన్న ఆకుపచ్చ ధాన్యాల కూరగాయలు పోషకాల నిధి అంటానే. దీనిని అనేక వంటకాల్లో వేస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బఠానీల్లో చిరు ధాన్యాలలో పోషకాలు పుష్కలం. వీటితో చేసే బఠానీ కూర, పరాటా, పూరీ ఇలా ఎన్నో రుచికరమైన వంటకాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. కొన్ని కూరగాయలు ప్రాచుర్యం పొందాని వాటిల్లో ఈ కూరగాయలలో పచ్చి బఠానీలున్నాయి. వీటి వెనుక రెండు కారణాలున్నాయి. ఒకటి ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. రెండోది ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల.. వీటిని చలికాలం(Winter Season) లో ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. పచ్చి బఠానీలు తింటే ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రోటీన్:

  • గుండె, శరీర కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు అవసరం. ఈ చిరు ధాన్యాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

గుండె ఆరోగ్యంగా:

  • బఠానీలలో ప్రోటీన్‌, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం అధికం ఉన్నాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేసి.. రక్తపోటును నియంత్రిస్తుంది. దీని కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

జీర్ణక్రియకు మేలు:

  • బఠానీలలో ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఫైబర్ ప్రేగులలో ఆహారాన్ని తరలించి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే బఠానీలు ఉపశమనం లభిస్తుంది.

బ్లడ్ షుగర్:

  • రక్తంలో చక్కెర(Blood Sugar) స్థాయి పెరిగితే.. మధుమేహం వస్తుంది. బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరగనివ్వదు. శారీరక శ్రమ, ఆహారం కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

క్యాన్సర్ చెక్:

  • బఠానీలలో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్ నష్టాన్ని నియంత్రించడం, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ సెల్ డ్యామేజ్‌కు కారణమవుతుంది. ఇది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది.

ఇమ్యూనిటీ పవర్ అధికం:

  • బఠానీలలో విటమిన్ సి, ఇ, ఎ జింక్ లాంటివి లభిస్తాయి, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతేకాదు ఇది మంట సమస్యను తగ్గిస్తుంది. దీనిని తినటం వల్ల కణాలు దెబ్బతినవు.

ఇది కూడా చదవండి: కాల్చిన వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అంటారు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు