Allu Arjun: నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్‌ పర్యటన ఎఫెక్ట్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటన పోలీసులకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్‌ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్‌, నాగరాజు ను వీఆర్‌ కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

New Update
Allu Arjun: నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్‌ పర్యటన ఎఫెక్ట్‌

Nandyala Police Suspend: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటన పోలీసులకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్‌, నాగరాజు ను వీఆర్‌ కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 11న ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే.

భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని ముందుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన పై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అంత మంది జనసమీకరణ చేయడంపై ఎలక్షన్‌ కమిషన్‌ సీరియస్ అయ్యింది.

ఈ నెల 11న అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి (Shilpa Ravichandra Kishore Reddy)ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. శిల్పా రవి అల్లు అర్జున్‌కు ఫ్రెండ్‌ కావడంతో.. ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్‌ ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్‌ వస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో వేలాది మంది జనం అక్కడకు చేరుకున్నారు. దీంతో శిల్పా రవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోగా.. అల్లు అర్జున్‌ మీద కూడ కేసు ఫైల్‌ అయ్యింది.

అనుమతి లేకుండా జనాలు అధిక సంఖ్యలో శిల్పా రవి ఇంటికి చేరుకోవడంతో స్థానిక నేతలు వారందరిని తీసుకుని వచ్చినట్లు ఆరోపిస్తూ స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: పుష్ప లవర్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఐటెమ్‌ సాంగ్‌లో ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు