Allu Arjun: నాగార్జునసాగర్‌పై అల్లు అర్జున్ కన్ను.. మామ కోసం అల్లుడి ప్రచారం

కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వస్థలం చింతపల్లిలో ఫంక్షన్‌ హాల్‌ను నిర్మించారు. రేపు సినీ హీరో అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది. అయితే ఈసారి మామ తరపున ప్రచారం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు కంచర్ల సిద్ధమైయ్యారు. క్షేత్రంలో నిర్మించిన ఆఫీస్, ఫంక్షన్ హాల్ ప్రారంభించేందుకు అల్లుడిని అక్కడికి రప్పిస్తున్నారు. అన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.

New Update
Allu Arjun: నాగార్జునసాగర్‌పై అల్లు అర్జున్ కన్ను.. మామ కోసం అల్లుడి ప్రచారం

Allu Arjun Election Campaign: అదృష్టం ఎలా ఉంటోదో..?

బీఆర్ఎస్ (BRS) స్టేట్ లీడర్ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి అల్లుడు అల్లు అర్జున్ (Allu Arjun) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు పెద్దవూరలో సినీ హీరో సందడి చేయనున్నారు. పార్టీ కార్యాలయం, ఫంక్షన్ హాల్ ప్రారంభించి.. అక్కడే 10 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. అక్కడే మహిళలకు చీరల పంపిణీ చేయనున్నారు. పెద్దవూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చంద్రశేఖర్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లతో చర్చలు జరిపి.. రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చంద్రశేఖర్ భావిస్తున్నారు. నిడమనూరు, పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో కంచర్లకు సామాజికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా సత్సబందాలు ఉన్నాయి.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్‌ను కాదని కంచర్లకు టికెట్ వస్తదా? అని పార్టీ నేతలకు సందేహాలు ఉన్నాయి. 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి చంద్రశేఖర్రెడ్డి ఓడిపోయారు. అక్కడి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సాగర్‌పైన దృష్టి పెట్టారు. మరి ఇక్కడి అదృష్టిం ఎలా ఉంటోదో చూడాలి మరి.

ప్రచారానికి రెడీ

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలకు సినీ హీరోలు క్యూ కట్టారు. అయితే ఈ సారి మాత్రం రాష్ట్ర రాజకీయంలో బాగానే హీట్‌ పెరుగుతోందని చెప్పాలి. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల సినీ తారతో ఆ సీట్లను తమ ఖాతాలోకి వేసుకోవడానికి గట్టిగా స్కెచ్ వేస్తున్నారనే చెప్పాలి. ఇక ఈ క్రమంలో పుష్ప మూవీతో తగ్గేదేలే అంటూ.. ప్యాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుకున్న ఐకాన్ సార్ట్ అల్లు అర్జున్ కూడా పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని కోసం మామ కోసం భారీ ప్రచారానికి రెడీ అవుతున్నారు.

ఇస్తారా..? లేదా..?

2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్‌గా పోటీలోకి దిగి ఆయన ఓడిపోయారు. ఆయన స్వస్థలం..నల్లగొండ జిల్లాలోని పెద్దపూర మండలం చింతపల్లి. కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి అధికార పక్షంలో బీఆర్ఎస్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అర్జున్‌ సపోర్ట్‌ చేశారు. అయితే ఈసారి పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేయడానికి వస్తున్నారు. అయితే ఇక ఈసారి రానున్న ఎన్నికల్లో మరోసారి లక్‌ను పరీక్షించుకోవడానికి ఆయన గ్రౌండ్ వర్క్ చేసున్న విషయం తెలిసిందే. అయితే నాగార్జున సాగర్ నుంచి ఈసారి పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేశారు. అయితే ఇక్కడ నుంచి కంచర్లకు కేసీఆర్ టికెట్ ఇస్తారా? లేదా? అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు