హైదరాబాద్ కు ఐకాన్ స్టార్..జాతీయ ఉత్తమ నటుడుకి ఘన స్వాగతం..!!

జాతీయ ఉత్తమ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హైదరాబాద్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న అల్లు అర్జున్ కు అభిమానులు పూల వర్షం కురిపిస్తు హోరెత్తిన నినాదాలతో ఘనంగా స్వాగతించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ కు అభివాదం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హైదరాబాద్‌ లోని ఆయన నివాసంకు చేరుకోగా.. వందలాది మంది అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

New Update
హైదరాబాద్ కు ఐకాన్ స్టార్..జాతీయ ఉత్తమ నటుడుకి ఘన స్వాగతం..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న అల్లు అర్జున్ కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

‘జాతీయ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఇంత గొప్ప గుర్తింపునిచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నేను సాధించిన మైలురాయి మాత్రమే కాదు.. మన సినిమాను ఆదరిస్తూ.. సపోర్ట్‌ చేసినవారందరికీ చెందుతుంది. అలాగే దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. నా విజయానికి ఆయనే కారణం’ అని బన్నీ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు

Also Read: మెహ్రీన్ మండిపాటు.. సెక్స్ సీన్స్‌కు మ్యారిటల్ రేప్ కు తేడా తేలియదా..?!

ఈ వేడుక ఫోటోలు, వీడియో లు ప్రస్తుతం సోషల్‌ మీడియా లో తెగ వైరల్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్‌ అభిమానుల హంగామా మాత్రం అంత ఇంత కాదు.. పుష్ప రాజ్ ను తెగ వైరల్‌ చేస్తున్నారు.

అయితే ఇతర హీరోల అభిమానులు మాత్రం బన్నీ విజయాన్ని.. దక్కిన గౌరవాన్ని గురించి పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. అల్లు అర్జున్ కి దక్కిన గౌరవం ను మరింత పెంచే విధంగా సన్మానం చేస్తే బాగుంటుంది అని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు.ఒక గొప్ప విషయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా తెలుగు వారు గర్వించే విధంగా చేశాడు. కనుక కచ్చితంగా ఇండస్ట్రీ నుంచి ఆయనకు సన్మానం అందాల్సిందే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు