Allari Naresh : ఒకే అమ్మాయిని ప్రేమించిన అల్లరి బ్రదర్స్.. చివరికి ఏమైందంటే! సొంత సోదురుడు ఆర్యన్ రాజేష్, తాను ఒకే అమ్మాయిని ప్రేమించినట్లు అల్లరినరేష్ తెలిపాడు. ‘నువ్వంటే నాకిష్టం’ చిత్రం ఎప్పటికీ మరిచిపోలేను. ఇందులో మేము ఒకే అమ్మాయిని ప్రేమిచడం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇంకెప్పుడు ఆ తప్పు చేయొద్దని ఫిక్స్ అయ్యాం’ అన్నాడు. By srinivas 30 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tollywood : టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్(Allari Naresh) ఆసక్తికరమైన విషయం బయటపెట్టాడు. దివంగత డైరెక్టర్ ఇవీవీ సత్యనారాయణ(EVV Satyanarayana) వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లరి నరేష్, రాజేష్ లు కొంతకాలంపాటు ప్రేక్షకులను అలరించారు. అయితే తండ్రి మరణం తర్వాత రాజేష్ ఇండస్ట్రీకి దూరమవగా.. నరేష్ కు సైతం సినిమా అవకాశాలు తగ్గడంతో భిన్నమైన స్టోరీస్ ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్(Aryan Rajesh) తో కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా తీస్తారు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఈ చిత్రం ఎప్పటికీ మరిచిపోలేను.. ఈ మేరకు ‘మేము ఇద్దరం కలిసి నటించిన ‘నువ్వంటే నాకిష్టం’ చిత్రం ఎప్పటికీ మరిచిపోలేను. ఆ చిత్రంలో మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమిస్తాం. ఆ సినిమాలో మేము ఇద్దరం అన్నాతమ్ముళ్లం కానప్పటికీ.. బయట సొంత బ్రదర్స్ అని అందరికి తెలుసు. దీంతో ఒకే అమ్మాయిని మేమిద్దరం ప్రేమిచడం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. బ్రదర్స్ ఒకే అమ్మాయితో ప్రేమలో పడడం ఏమిటని ఛీ కొట్టారు. ఆ మూవీ ఫ్లాప్ అయింది. అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకుండా జాగ్రత్తపడుతున్నాం. బ్రదర్ సెంటిమెంట్‌తో మంచి కథ దొరికితే అప్పుడు ఆలోచిస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి: Chhattisgarh: అబూజ్‌మడ్ అడవుల్లో మరో భారీ ఎన్ కౌంటర్.. పది మంది మృతి! ఇక ఆ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించగా.. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌గా నటించింది. చిలకా ప్రొడక్షన్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మించారు. ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది. #allari-naresh #evv-satyanarayana #aryan-rajesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి