Jonty Rhodes: టీమిండియాలోకి జాంటీ రోడ్స్.. బీసీసీఐ స్కెచ్ మాములుగా లేదుగా!

టీమిండియాకు కొత్త కోచ్ లు రాబోతున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్ గా రావచ్చని చెబుతున్నారు. ఇక ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఫీల్డింగ్ కోచ్ కోసం అప్లై చేసినట్టు.. టీమిండియా తో పని చేయడానికి ఉత్సుకతతో ఉన్నట్టు రోడ్స్ చెప్పారు. 

New Update
Jonty Rhodes: టీమిండియాలోకి జాంటీ రోడ్స్.. బీసీసీఐ స్కెచ్ మాములుగా లేదుగా!

Jonty Rhodes: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత.. టీమ్ ఇండియాకు కొత్త కోచ్ నియామకం జరుగుతుంది.  దీనితో పాటు ఇతర కోచ్ స్థానాల్లో కూడా కొత్త వ్యక్తులు కనిపించనున్నట్లు సమాచారం. ఈ మార్పుల వార్తల లో ప్రముఖంగా వినిపిస్తున్నది.. జాంటీ రోడ్స్‌ను టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా నియమించనున్నారనే వార్త అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు రోడ్స్ ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

Jonty Rhodes: అంతకు ముందు 9 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2019లో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ పదవికి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. కానీ బీసీసీఐ అతడిని ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు కొత్త కోచ్ ఎంపిక వార్తల తర్వాత భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు తెరపైకి వచ్చింది. కాబట్టి, రాబోయే రోజుల్లో టీమ్ ఇండియాతో జాంటీ కూడా కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 

అప్లై చేసిన జాంటీ రోడ్స్:
Jonty Rhodes: భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు జాంటీ రోడ్స్ కూడా ధృవీకరించారు. నా భార్య, నేను భారతదేశాన్ని చాలా ప్రేమిస్తాము. ఈ దేశం మనకు చాలా ఇచ్చింది. టీమ్ ఇండియాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జాంటీ రోడ్స్ తెలిపాడు.

ప్రస్తుత భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ ఎవరు?
టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా టి. దిలీప్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో.. దిలీప్ పదవీకాలం కూడా ముగియనుంది. అందుకే కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ ఎంపికపై బీసీసీఐ ఆసక్తి చూపుతోంది.

జాంటీ మ్యాజిక్:
Jonty Rhodes: దక్షిణాఫ్రికా తరఫున 52 టెస్టు మ్యాచ్‌ల్లో జాంటీ రోడ్స్ 34 క్యాచ్‌లు అందుకున్నాడు. అదే సమయంలో 5 రనౌట్లు కూడా చేశాడు. 245 వన్డే మ్యాచ్‌ల్లో 105 క్యాచ్‌లు పట్టాడు. అలాగే 51 రనౌట్లు చేశాడు. ఫీల్డింగ్ లో పాదరసంలా కదిలే రోడ్స్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు