Train Tickets: రెండు నెలల ముందే ట్రైన్‌ సీట్లు ఫుల్‌.. ఎందుకో తెలుసా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు రోజురోజుకి పెరుగుతుండడంతో పాఠశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సెలవులకు ఊర్లు వెళ్లేవారు చాలా మంది టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. దీంతో రెండు నెలల ముందే ట్రైన్లన్ని ఫుల్ అయిపోయాయని రైల్వే శాఖాధికారులు వెల్లడించారు.

New Update
Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!

సాధారణంగా వేసవి సెలవులు (Summer Holidays)వస్తున్నాయంటే... మే మొదటి వారంలో కానీ, ఏప్రిల్‌ చివరి వారంలో కానీ ట్రైన్‌ టికెట్లు (Train Tickets) ఫుల్‌ అవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు రోజురోజుకి పెరుగుతుండడంతో పాఠశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

దీంతో సెలవులు రావడమే సొంతూర్లకు బయల్దేరేవారు చాలా మంది బస్సు, ట్రైన్లకు టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. దీంతో రెండు నెలల ముందే ట్రైన్లన్ని ఫుల్ అయిపోయాయని రైల్వే శాఖాధికారులు వెల్లడించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రైన్‌ టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.

వేసవి సెలవులు ముగిసేంత వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైలు టికెట్లు బుక్‌ చేసుకోవాలి అనుకునేవారు 4 నెలల ముందే టికెట్‌ రిజర్వు చేసుకునే అవకాశం ఉండడంతో వేసవి సెలవులు దృష్టిలో పెట్టుకుని ముందుగానే చాలా మంది టికెట్లు బుక్‌ చేసేసుకున్నారు.

దీంతో కేవలం రెండు మూడు రోజుల్లోనే బెర్తులన్నీ ఫుల్‌ అయిపోతున్నాయి. దీంతో అత్యవసర పనులు , ప్రయాణాలు పెట్టుకున్న వారు టికెట్లు దొరకక నానా తిప్పలు పడుతున్నారు. బస్సులో వెళ్దామనుకున్న ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కేవలం పండుగ సమయంలో తప్ప సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడిపే పరిస్థితి లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత కాలం క్రితం రెండు వందేభారత్‌ రైళ్లను ప్రవేశ పెట్టినప్పటికీ కూడా ఇబ్బంది మాత్రం తప్పడం లేదు.

Also read: యూకేలో తిప్పలు పడుతున్న ఇండియన్‌ స్టూడెంట్స్ ..కారణం ఏంటంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు