TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే!

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28వ తేదీ రాత్రి 7.05 గంటలకు మూసివేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరిగి 29వ తేదీ ఉదయం 3.15 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకుంటాయి.

New Update
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే!

తిరుమల వెళ్లాలని ప్లాన్ లో ఉన్న శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 28న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 8 గంటల పాటు మూసివేయనున్నారు. అక్టోబర్ 29వ తేదీ ఉదయం 1.05 గంటల నుంచి 20.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగానే 28వ తేదీ రాత్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అక్టోబర్ 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. తిరిగి 29వ తేదీ ఉదయం 3.15 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. 8 గంటలపాటు శ్రీవారి భక్తులు దర్శనం రద్దు అవుతుంది. గ్రహణం కారణంగా ఈ నెల 28న సహస్ర దీపాలంకరణ సేవ, వికలాంగులు, వయో వృద్ధులకు దర్శనం రద్దు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇవాళ్టి నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ..!!

అటు ఏడుకొండల్లో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తుంటారు. వివిధ మార్గాల్లో తిరుమల చేరుకునే భక్తులు ఆ ఏడు కొండలవారిని దర్శించుకుని పులకించిపోతారు. అయితే నడకమార్గంలో పులల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 22వ తేదీన అనంతపురం జిల్లాకు చెందిన కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసింది. కానీ ఆ బాలుడు చిరుత దాడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు.అయితే ఇదే ఏడాది ఆగస్టు 12వ తేదీన అలిపిరి మెట్ల మార్గంలో తన తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్న లాక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో టీటీడీ అలర్టయ్యింది. నడకదారిన వెళ్లే భక్తులను అప్రమత్తం చేసింది. అయినా కూడా తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లేందుకు కూడా భక్తులు జంకుతున్నారు.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అలర్ట్.. 1720 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులకు మొదటి ఘాట్ రోడ్డులో చాలాసార్లు చిరుతలు కనిపించాయి. చిరుతలను చూసినట్లుగా టీటీడీ విజిలెన్స్ అధికారులకు భక్తులు అనేక సార్లు తెలిపారు. దీంతో ఘాట్ రోడ్డులతో పాటు నడకదారిలోనూ అధికారులు ఆంక్షలు విధించారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచిస్తోంది. మధ్యాహ్నం నడక దారిలో వెళ్లే భక్తులకు ఉత కర్రను ఇస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి మెట్ల మార్గంలో 12ఏళ్ల లోపు చిన్నారులను అనుమతించడం లేదు. ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలపై కూడా ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే టూవీలర్స్ కు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు