TTD : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవల్సిందే..!! తిరుమలకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా?డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు పదిరోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. 10 కేంద్రాల్లో రోజుకు 42,500 చొప్పున 10 రోజుల్లో 4.25 లక్షల టోకెన్లు విడుదల చేయనుంది. By Bhoomi 11 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Alert To Devotees : తిరుమల(Tirumala) కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న భక్తులకు ముఖ్య గమనిక. మీరు తిరుమల వెళ్లాలనుకుంటే మాత్రం ముందుగా ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. వైకుంఠ ద్వారా దర్శనం సమయంలో చాలా మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. ఆ రోజు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో మీరు కూడా వైకుంఠ ద్వార దర్శన సమయంలో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ విషయాలును తెలుసుకోవాలి. తిరుమలలో ఎప్పుడు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నారో అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా తిరుమలకు ప్లాన్ చేసుకుంటే మంచిది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెలలో వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభం అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు మొత్తం పదిరోజుపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. దీనికోసం టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యం కోసం తిరుపతి,తిరుమలలోని 10 కేంద్రాల్లో డిసెంబర్ 22 నుంచి 4.25 లక్షల టోకెన్లు ఇవ్వనున్నారు. రోజుకి 42,500 చొప్పున 10 రోజుల్లో 4.25 లక్షల టోకెన్లు రిలీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మీరు తిరుమలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లయితే మాత్రం ఈ టోకెన్లు తీసుకోవడం మంచిది. అలాగే మీరు తిరుమల వెళ్లే ముందు అక్కడి పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు తిరుమల వెళ్లే సమయంలో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందా ? లేదంటే చలి తీవ్రత ఎక్కువగా ఉందా? వంటి విషయాలను కూడా తెలుసుకోవాలి.ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు ఇలా వర్షాలు పడితే..సమస్యలు తప్పవ. ఈ సమయంలో అక్కడ చలి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: యువ లాయర్లకు ఏపీ సీఎం గుడ్ న్యూస్..నేడు వారి అకౌంట్లోకి రూ. 30వేలు జమ..!! #andhra-pradesh #alert #devotees #ttd-news #tirupati-tirumala #vaikunthadwara మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి