Job Alert: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు కొద్ది రోజులే గడువు..

వివిధ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్స్ జారీ అయ్యాయి. ఈవారం దరఖాస్తు చేసుకోవాల్సిన రిక్రూట్‌మెంట్స్ ఏవో చూద్దాం.

New Update
Job Alert: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు కొద్ది రోజులే గడువు..

ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువతకు ఆసక్తి పెరుగుతోంది. ఏటా పోటీ పరీక్షలకు ఎక్కువ మంది హాజరవుతున్నారు. కెరీర్ వృద్ధితో పాటు మంచి జీతం, సెక్యూర్డ్ లైఫ్ ఉండటమే అందుకు కారణం. మీరు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. వివిధ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్స్ జారీ అయ్యాయి. ఈవారం దరఖాస్తు చేసుకోవాల్సిన రిక్రూట్‌మెంట్స్ ఏవో చూద్దాం.

* యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ upsc.gov.in విజిట్ చేసి అప్లై చేసుకోవాలి. ఇందుకు గడువు మే 2న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్‌తో 109 ఖాళీలు భర్తీ కానున్నాయి.

* నాబార్డ్-బర్డ్ రిక్రూట్‌మెంట్

బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (BIRD) నాబార్డ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. బర్డ్-లక్నో బ్రాంచ్‌లో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అండ్ మైక్రోఫైనాన్స్ (CRFIM) విభాగంలో రీసెర్చ్ ఆఫీసర్ పోస్ట్‌కు రెండేళ్లపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తంగా రెండు ఓపెనింగ్స్ ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ nabard.org విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు ఏప్రిల్ 30న ముగుస్తుంది.

* CMPFO రిక్రూట్‌మెంట్

కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (CMPFO) వివిధ పోస్ట్‌ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్నవారు CMPFO అధికారిక పోర్టల్ విజిట్ చేసి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు ఏఫ్రిల్ 29న ముగుస్తుంది. అసిస్టెంట్ కమిషనర్ (IT), అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, ఫైనాన్స్ ఆఫీసర్, అదనపు కమిషనర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, రీజినల్ కమిషనర్-I, సీనియర్ ఫైనాన్స్ ఆఫీసర్, రీజనల్ కమిషనర్- II వంటి ఉద్యోగాలు అన్నీ కలిపి మొత్తం 61 పోస్టులు భర్తీ కానున్నాయి.

* NCERT రిక్రూట్‌మెంట్

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT).. కౌన్సిల్ పోస్ట్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ (DESM) స్టేట్‌మెంట్ ప్రకారం.. సిస్టమ్ అనలిస్ట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో వంటి రెండు ఓపెన్ పొజిషన్స్ కోసం ఏప్రిల్ 25న వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. బోర్డ్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్, DESM, జానకి అమ్మాల్ ఖండ్, NCERT, శ్రీ అరబిందో మార్గ్, న్యూఢిల్లీ అనే అడ్రస్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. నిర్దేశించిన తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు