హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఢిల్లీలో లాగా బేసి, సరి రూల్?

హైదరాబాద్ లో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఎక్కడికి వెళ్లాలన్నా గంటల సమయం పడుతుంది. ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్ సిటీలోనూ బేసి, సరి సంఖ్య విధానాల్లో అమల్లోకి తీసుకురావాలన్న అంశంపై ట్రాఫిక్ విభాగం చర్చలు జరుపుతుంది.

New Update
హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఢిల్లీలో లాగా బేసి, సరి రూల్?

హైదరాబాద్ లో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా గంటల సమయం పడుతోంది. కాలనీల్లోనూ ట్రాఫిక్ ఫికర్ పట్టుకుంది. ఉదయం, సాయంత్రం, ఆఫీసులకు వెళ్లేసమయం, వచ్చే సమయంలో ట్రాఫిక్ సమస్యల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. 15కిలోమీటర్లు వెళ్లాలంటే గంటన్నర నుంచి 2 గంటల సమయం పడుతుంది. దీనికి తోడు ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి 85లక్షల వాహనాలుఉన్నాయి. ఒక్క 2023 డిసెంబర్ నాటికి 16వేల వాహనాలు కొత్తగా రోడ్డుపైకి వచ్చాయి. వీటిలో టూ వీలర్స్, కార్లు, గూడ్స్, బస్సులు వంటివి ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. దీనికి తోడు పొల్యూషన్ తోపాటు , ప్రయాణ సమయం కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీన్ని పరిగణలోనికి తీసుకుని హైదరాబాద్ సిటీలోనూ ఢిల్లీ, ముంబై తరహాల బేసి, సరి సంఖ్య విధానాల్లో అమల్లోకి తీసుకురావాలన్న అలోచన పై ట్రాఫిక్ విభాగం చర్చలు జరుపుతోంది.

వాహనాలు రోడ్డెక్కడానికి బేసి, సరి సంఖ్య విధానాన్ని ఢిల్లీ, ముంబైలో ఇప్పటికే అమల్లో ఉంది. దీనితో ట్రాఫిక్ రద్దీ 20శాతం వరకు తగ్గినట్లు అంచనా వేసారు. ఇదే సమయంలో బైక్స్, కార్ల వాహనాదారులకు ఇబ్బందులు లేకుండా కారు పూలింగ్ విధానాల్లో అమల్లోకి తీసుకురావాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం ఆలోచిస్తుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతోపాటు వ్యక్తిగత వాహనాలు రోడ్డుపైకి రాకపోవడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం తగ్గుతుందని ట్రాఫిక్ పోలీసు విభాగం అంచనా వేసింది. అయితే ఈ సమయంలో కాలనీల నుంచి మెట్రోకు ప్రత్యేక బస్సులు నడపడం, మెట్రో వినియోగాన్ని పెంచడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

బేసి, సరి విధానం అంటే...మీ బైక్ లేదా కారు నెంబర్ లో చివరి సంఖ్య. ఉదాహరణకు మీ వాహనం నెంబర్ 2345 అనుకుంటే...మీ చివరి నెంబర్ 5 అయితే మీ బేసి సంఖ్య. అప్పుడు మీ వెహికల్ 1,3,5,7,9,12,14,16,18,21,23,25 ఈ తేదీల్లో రోడ్డుపైకి రావాలి. అదే మీ వాహనం నెంబర్ 1234 అయితే..చివరి నెంబర్ 4. సరి సంఖ్య అప్పుడు మీ వాహనం 2,4,6,8,11,13,15,17,20,22,24,26,29 తేదీల్లో రోడ్డుపైకి రావాలి. మిగతా రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేదా కారు పూలింగ్ విధానాన్ని ఉపయోగించుకోవాలి.

ఈవీలకు మినహాయింపు:
సరి, బేసి సంఖ్య విధానంలోనూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా ఈవీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదే విధంగా ట్యాక్సీలు, ఓలా ఉబేర్, ర్యాపిడో వంటి పబ్లిక్ సర్వీసులకు అన్ని రోజులు పర్మిషన్ ఉంటుంది. ఇదే సమయంలో హైదరాబాద్ లో కొత్తగా, కొత్త బస్సులను తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది. స్కూల్ బస్సులు, వ్రుద్ధులు, మహిళలకు సంబంధించి ప్రత్యేక బస్సులకు ఈ విధానంలో ఆయా ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి.

ఇది కూడా చదవండి: సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు