భాగ్యనగరవాసులకు అలర్ట్! ఆ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ బంద్

భాగ్యనగరంలో ఉండేవారికి జీహెచ్‌ఎంసీ అలర్ట్ చేసింది. వచ్చే శనివారం (19-08-2023) ఉదయం నుండి ఆదివారం (20-08-2023) మధ్యాహ్నం వరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. మంజీరా నీటి సరఫరా ఫేజ్-2లో మరమ్మతుల కారణంగా నగరంలోని కూకట్‌పల్లి, లింగంపల్లి, జగద్గిరిగుట్ట, అమీర్‌పేటతో సహా పలుచోట్ల అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులు కోరారు.

New Update
భాగ్యనగరవాసులకు అలర్ట్! ఆ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ బంద్

వచ్చే శని, ఆదివారాలలో మంజీరా నీటి సరఫరా ఫేజ్-2 పైప్ లైన్ల మరమ్మతుల కారణంగా నగరంలో పలు చోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. శనివారం ఉదయం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు అంతరాయం కలగనున్నట్లు జీహెచ్‌ఎంసీ సిబ్బంది తెలిపారు. మంజీరా నీటి సరఫరా ఫేజ్-2లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) మరమ్మతులు చేపట్టనుంది. దీనికారణంగా పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిపివేస్తున్నట్లు తెలిపింది.దీంతో సదరు కాలనీల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు.

hmwssb alert

హైదరాబాద్‌ నగరంలోని కలబ్‌గూర్ నుండి పటాన్ చెరు నుండి హైదర్‌నగర్ వరకు 1500 ఎంఎండయా ఎంఎస్ పైప్‌లైన్ మరమ్మతుల నేపథ్యంలో అగస్ట్ 19 ఉదయం 6 గంటల నుండి అగస్ట్ 20వ తేదీ 12 గంటల వరకు అంటే దాదాపు 30 గంటల పాటు నీటి సరఫరా ఉండదని తెలిపారు. ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్, మియాపూర్, లింగంపల్లి, చందానగర్, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, బీరంగూడ, అమీన్‌పుర ప్రాంతాల్లో నీటిసరఫరాకు అంతరాయం కలగనుంది.

నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగిపోవడంతో కలిగే ఇబ్బందులను తొలగించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. నీటిని పొదుపుగా వాడుకుని నీటి కష్టాలను అధిగమించాలని సూచిస్తున్నారు. 36 గంటల పాటు జరిగే నీటి సరఫరా ఇబ్బందులను తొలగించుకునే క్రమంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు