Nagarjuna Akkineni : నాగార్జున ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్

నేడు నాగార్జున బర్త్ డే కావడంతో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరనం నెలకొంది. అభిమాన హీరోకు విషెష్ చెప్పేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్లగా.. నాగార్జున ఇంటి గెట్ దగ్గరికి వచ్చారు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

New Update
Nagarjuna Akkineni : నాగార్జున ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్

Nagarjuna Akkineni : టాలీవుడ్ సీనియర్ స్టార్ కింగ్ నాగార్జున నేడు (ఆగస్టు 29) తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగ్ కు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. తాజాగా ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరనం నెలకొంది. కొందరు ఫ్యాన్స్ నాగార్జున ఇంటి దగ్గర హంగామా చేశారు.

Also Read : పెళ్లి ఎప్పుడు.. ఎక్కడో చెప్పేసిన నాగచైతన్య..?

అభిమాన హీరోకు బర్త్ డే విషెష్ చెప్పేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్లగా.. నాగార్జున ఇంటి గెట్ దగ్గరికి వచ్చారు. తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆయన్ను చూసి కింగ్.. కింగ్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. అంతేకాకుండా 'హ్యాపీ బర్త్ డే కింగ్' అంటూ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు