/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/akhilesh-jpg.webp)
ఉత్తరప్రదేశ్ (Uttarapradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) లక్నో(Lucknow)లో గోడలు దూకారు. ఇది ఏంటి అఖిలేష్ యాదవ్ గోడలు దూకడం అనుకుంటున్నారా..అయితే ఈ కథనం చదివేయండి. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ లోనికి వెళ్లేందుకు అఖిలేష్ యాదవ్ తన అనుచరులతో కలిసి వచ్చారు.
అయితే భవనం లోపల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. దాంతో లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అఖిలేష్ యాదవ్ ప్రహారీ గోడ దూకి లోపలికి వెళ్లారు. ఆయన వెంట ఉన్న అనుచరులు కూడా ఇదే పద్దతిని అనుసరించారు. అందరు కూడా గోడ దూకి లోపలికి ప్రవేశించారు.
Also read: క్యాబ్ డ్రైవర్ తో గొడవ..200 మీటర్లు ఈడ్చుకెళ్లిన దుండగులు!
ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన గురించి అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేక పోరాటాన్ని బీజేపీ మళ్లీ మొదలు పెట్టేందుకు భయపడుతుందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బీజేపీ పాలనలో అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చాలా పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో జయప్రకాష్ నారాయణ్ మాదిరిగా సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వాల్సి ఉందని ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.
VIDEO | Samajwadi Party chief Akhilesh Yadav climbs a wall while trying to enter Jai Prakash Narayan International Center in Lucknow, Uttar Pradesh. The officials had reportedly denied permission to the party workers, citing the construction work at the centre. pic.twitter.com/lkKKz6XOjl
— Press Trust of India (@PTI_News) October 11, 2023