Ambani Wedding: అది పెళ్లి కాదు ఓ సర్కస్.. అనంత్ వెడ్డింగ్‌పై ఆలియా షాకింగ్ కామెంట్స్!

అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు. అది ఓ సర్కస్ లా ఉందంటూ ఆలియా కశ్యప్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 'నన్ను పెళ్లికి ఆహ్వానించారు. కానీ డబ్బుల కోసం పెళ్లికి వెళ్లాలనుకోవడం లేదు. వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని భావిస్తున్నా' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

New Update
Ambani Wedding: అది పెళ్లి కాదు ఓ సర్కస్.. అనంత్ వెడ్డింగ్‌పై ఆలియా షాకింగ్ కామెంట్స్!

Aaliyah Kashyap: ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై వేదికగా అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకను ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

ఈ మేరకు 'అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు. అది ఓ సర్కస్ లా ఉంది. నేను కూడా ఆ సర్కస్‌ను ఫాలో అవుతున్నా. నన్ను పెళ్లికి ఆహ్వానించారు. కానీ డబ్బుల కోసం పెళ్లికి వెళ్లాలనుకోవడం లేదు. వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని భావిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా పోస్ట్ వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి.

#wedding #akash-ambani #alia-kashyap
Advertisment
Advertisment
తాజా కథనాలు