Airstrike in Ethiopia: ఇథియోపియాలో ఎయిర్ స్ట్రైక్స్... 26 మంది మృతి....!

ఇథియోపియాలోని అమ్హరా ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు. మరో 55 మందికి తీవ్రగాయాలైనట్టు ఆ దేశ అధికారి ఒకరు తెలిపారు. . ఫానో మిలిషియా సభ్యులకు ఆహారం అందించేందుకు వెళ్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని ఈ ధాడి జరిగినట్టు తెలుస్తోంది.

New Update
Airstrike in Ethiopia: ఇథియోపియాలో ఎయిర్ స్ట్రైక్స్... 26 మంది మృతి....!

Airstrike in Ethiopia's Amhara : ఇథియోపియాలోని అమ్హరా ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. జనసమ్మర్దం ఎక్కువగా వున్న ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్ జరగడంతో మృతుల సంఖ్య భారీగా వుంది. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు. మరో 55 మందికి తీవ్రగాయాలైనట్టు ఆ దేశ అధికారి ఒకరు తెలిపారు. గత కొంత కాలంగా దేశంలోని మిలటరీకి, స్థానిక మిలీషియా దళాలకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది.

తాజాగా అమ్హరాలోని ఫినోట్ సేలం కమ్యూనిటీ సెంటర్ పై మిలటరీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఫానో మిలిషియా సభ్యులకు ఆహారం అందించేందుకు వెళ్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని ఈ ధాడి జరిగినట్టు తెలుస్తోంది. ఫినోల్ సేలం ప్రాంతంలోని ఎయిర్ స్ట్రైక్ గురించి తమ దృష్టికి వచ్చిందని ఇథియోపియా హ్యూమన్ రైట్స్ కమిషన్ (Ethiopia Human Rights)వెల్లడించింది. ఈ ఘటనపై నివేదికలు తెప్పించుకుంటున్నామన్ని పేర్కొంది.

ఇథియోపియాలో(Ethiopia)ని అమ్హారా ప్రాంతంలో మిలటరీకి, మిలీషియా దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో హింసాకాండ మొదలైంది. సాయుధ తీవ్ర వాద గ్రూపులు చేస్తున్న దాడుల వల్ల ప్రజా రక్షణకు ముప్పు కలుగుతోందని దేశ ప్రధాని అబెయ్ అహ్మద్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్రమైన నష్టం కలుగుతోందన్నారు. అందుకే ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించారు.

అమ్హారా ప్రాంతంలో ఎమర్జెన్సీ చట్టాల కింద భారీగా అరెస్టులు చేస్తున్నారు. అనుమానితులను ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు, పౌరసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ అడిస్ అబాబా ప్రాంతంలో అత్యవసర సమయంలో 23 మందిని మాత్రమే అరెస్టు చేసినట్టు ఇథియోపియా ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: రష్యా గ్యాస్‎స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం, 25మంది మృతి..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు