Paris Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత పురుషుల హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2తేడాతో ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతం చేశాడు

New Update
Paris Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత పురుషుల హాకీ జట్టు

Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ జట్టు మీద ఆశలు భారీగా ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ టీమ్ ఇండియా మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను బీట్ చేసింది. 3-2 తేడాతో విజయం సాధించింది. స్కిప్పర్ హర్మన్ ప్రీత్ సింగ్ మ్యాజిక్ చేశాడు. చివరి నిమిషంలో గోల్ కొట్టి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్ నుంచి శామ్ లేన్, సైమన్ చైల్డ్ గోల్స్ చేయగా..ఇండియా తరుఫున మన్‌దీప్‌ సింగ్, వివేక్ సాగర్, హర్మన్ ప్రీత్‌లు గోల్స్ కొట్టారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్, అభిషేక్‌లు న్యూజిలాండ్ గోల్స్ కొట్టకుండా గట్టి ప్రయత్నం చేశారు.

అయితే న్యూజిలాండ్ మ్యాచ్ మొదలైన దగ్గర నుంచీ దూకుడుగా ఆడింది. మొదటి పెనాల్టీ కార్నర్‌లోనే గోల్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చింది. అక్కడి నుంచి భారత జట్టు జాగ్రత్తగా, పట్టుదలగా ఆడడం మొదలుపెట్టింది. ఆటలో భాగంగా టీమ్ ఇండియాకు ఐదు పనాల్ట గోల్స్ లభించాయి. కానీ వాటిల్లో భారత ఆగాళ్ళు ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకోగలిగారు. మరోవైపు న్యూజిలాంగ్ తొమ్మది సెట్‌ పీస్‌లలో రెండింటిని ఉపయోగించుకుంది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ ఫ్లిక్‌ను న్యూజిలాండ్ గోల్‌కీపర్ డొమినిక్ డిక్సన్ రక్షించిన తర్వాత మన్‌దీప్ రీబౌండ్ నుండి గోల్ చేయడంతో భారత్ 24వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా సమం చేసింది.

ఇక మ్యాచ్‌లో రెండో హాఫ్ మొదలైన తర్వాత వివేక్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యంవైపు దూసుకెళ్ళింది. తర్వాత న్యూజిలాంగ్ నాలుగు పెనాల్టీ కార్నర్‌లను సాధించినా...వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. కానీ న్యూజిలాండ్ ప్లేయర్ చైల్డ్ రెండో గోల్స్‌ ను కొట్టాు. దాంతో రెండు టీమ్‌లస్కోర్లు సమం అయ్యాయి. ఇక మ్యాచ్ చివరలో సుఖ్‌జీత్ సింగ్ స్మార్ట్‌గా ఆడి పెనాల్టీ కార్నర్‌ను సాధించాడు. ఈ అవకాశాన్ని కెప్టెన్ పోగొట్టుకోకుండా గోల్ చేసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు