AI Resume Tools: ఈ AI టూల్ తో మీ రెస్యూమ్ రెండే నిమిషాల్లో రెడీ.. ఇప్పుడు రెస్యూమ్ చేసుకోవడం చాల సులభంగా మారింది, కొత్త AI టెక్నాలజీని ఉపయోగించి క్షణాల్లో రెస్యూమ్ ని చేసుకోవచ్చు. రేజి, కిక్ రెజ్యూమె, డిజైన్స్ ఏఐ, రెజ్యూమె.ఐవో, రెజ్యూమేకర్.ఏఐ, కాన్వా రెజ్యూమె మేకర్ ఇలా లిస్ట్ లో చాలా AI కి సంబంధించిన అద్భుతమైన టూల్స్ ఉన్నాయి. By Lok Prakash 18 Jun 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి AI Resume Tools: చూడగానే ఆకర్షించేలా చక్కని సీవీని తయారుచేయడం అంత సులువైన పనేం కాదు! ఇందుకోసమే ఏఐ టూల్స్(AI Resume Tools) అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు తమ వివరాలు అందిస్తే చాలు.. చిటికెలో సమగ్రమైన రెజ్యూమెలను తయారు చేస్తాయి. అవేంటో, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. అభ్యర్థిని చూడగానే తొలి అభిప్రాయాన్ని కలిగించేందుకు దోహదపడే రెజ్యూమె విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మన అర్హతలతోపాటు బలాలు, నైపుణ్యాలు, అనుభవాలు, అన్నింటినీ ఆసక్తికరంగా చూపించగలగడం ముఖ్యం. మంచి రెజ్యూమె అభ్యర్థి ప్రొఫెషనలిజాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంతటి విలువ ఉన్న రెజ్యూమెను తయారుచేయడంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయపడుతున్నాయి. కాబట్టి మంచి జాబ్ పొందాలి అంటే ఈ AI టూల్స్ ఉపయోగించుకొని మంచి రెజ్యూమె చేసుకుంటే సరి..! రేజి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. రెజి (REZI)ఓపెన్ ఏఐ జీపీటీతో పనిచేస్తోంది. రెజ్యూమె రాసేందుకు, ఎడిట్ చేసేందుకు, క్రమబద్ధీకరించేందుకు.. అన్ని విధాలా ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ వినియోగంపై ఎటువంటి అవగాహన లేని వాళ్లయినా సరే దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. విషయాన్ని బుల్లెట్ పాయింట్ల రూపంలో విభజిస్తుంది. రెజ్యూమె బిల్డింగ్ సాఫ్ట్వేర్స్, సేవలను అందించేందుకు ఇది ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు, కాలేజీలతో అనుసంధానమై పనిచేస్తూ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. కిక్ రెజ్యూమె దీనిలో(kickresume) ఆటోపైలెట్ బిల్ట్ ఇన్ సెటప్ ఉంది. ఇందులో 20 వేలకు పైగా ముందుగా రాసిపెట్టిన రెస్యూమేలు ఉంటాయి. వీటిని మన అవసరానికి తగినట్టుగా ఉపయోగించుకోవచ్చు. ఏఐ రైటర్, టెంప్లేట్స్.. ఇలా చాలా అభ్యర్థుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ టూల్ జీపీటీ-4 ద్వారా పనిచేస్తోంది. అభ్యర్థులు తప్పుల్లేకుండా సరైన రెజ్యూమెలు రాసేందుకు ఉపయోగపడుతుంది. డిజైన్స్ ఏఐ ఇందులో(designs.al) కాపీ రైటర్స్, వీడియో మేకర్స్, డిజైన్ మేకర్స్ వంటి ఎన్నో టూల్స్ తో పాటు గ్రాఫిక్ మేకర్, కలర్మ్యాచర్ టూల్స్ కూడా పనిచేసుకోవచ్చు. వెయ్యికి పైగా రెజ్యూమె టెంప్లేట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ పరిశ్రమలో ఉద్యోగం ఆశించేవారైనా సరే వారికి కావాల్సిన రెజ్యూమెలు లభిస్తాయి. ఒక్క పేజే ఉండాలా, అక్షరాలు ఏ విధంగా ఉంటే చదవడానికి వీలుగా ఉంటుంది.. ఇటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. జెటి ఇందులో(Zety) ఉన్న రెడీమేడ్ కంటెంట్‌ను సర్టిఫైడ్ ప్రొఫెషనల్ రెజ్యూమె రైటర్లు తయారుచేశారు. వీటిని ఉపయోగించుకోవడమే కాకుండా మన పాత రెజ్యూమెలను అప్లోడ్ చేస్తే కొత్త ఫార్మాట్లలోకి అదే ఆటోమేటిగ్గా మారుస్తుంది. అంటే ఒక్కసారి కావాల్సిన వివరాలేంటో నిర్ణయించుకుని అందిస్తే.. తర్వాత సమయపు వృథా లేకుండా ఎన్నిసార్లైనా ఫార్మాట్ మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. రెజ్యూమె.ఐవో ప్రస్తుతం ఉన్న రెజ్యూమె రైటర్లలో ఇది(resume.lo) ముఖ్యమైనది. దీంతో కేవలం నిమిషాల్లోనే ప్రొఫెషనల్ సీవీలు తయారుచేసే వీలుంది. యూజర్లు ఇక్కడుండే టెంప్లేట్స్‌లో ఏది కావాలంటే అది ఉపయోగించుకోవచ్చు. కవర్ లెటర్లు కూడా ఉచితంగా లభిస్తాయి. వీటికి కూడా ప్రత్యేకంగా టెంప్లేట్స్ ఉన్నాయి. నచ్చిన విధంగా రెజ్యూమెను సిద్ధం చేసి వర్డ్ లేదా పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో స్పెల్లింగ్ చెక్, సమ్మరీ తయారీ ఆటోమేటిగ్గా జరిగిపోతాయి. ఇది కూడా చదవండి: ఈ ఆసనాలతో గుండె సమస్యలకు చెక్.. యోగా దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను తెలుసుకోండి! కాన్వా రెజ్యూమె మేకర్ ఇందులో(canva) వందలాదిగా ఉన్న టెంప్లేట్స్ నుంచి మన పరిశ్రమ, అవసరానికి తగినట్టుగా నచ్చింది తీసుకోవచ్చు. దాన్ని అవసరానికి తగినట్టుగా మార్చుకునే వీలుంది. రంగు, ఫాంట్, లేఅవుట్.. వంటివి మార్చడంతోపాటు గ్రాఫిక్స్ కూడా జతచేర్చవచ్చు. ఒక అంచనా ప్రకారం.. రిక్రూటర్లు రెజ్యూమె చూసిన మొదటి ఆరు సెకన్లలోనే అభ్యర్థి వారికి నచ్చిందీ లేనిదీ అంచనాకు వచ్చేస్తారట! ఆలోపే మన స్కిల్స్‌ను చక్కగా తెలిసేలా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మన డిజైన్ ను సేవ్ చేసుకోవడంతోపాటు తిరిగి ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. #rtv #professional-resume #ai-tools #ai-resume-tools మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి