Kannada Actor Darshan : నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు!

అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సోషల్‌ మీడియాలో ఓ ఫొటో వైరల్‌ గా మారగా.. తాజాగా ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అందులో దర్శన్‌ తన స్నేహితులతో వీడియో కాల్‌ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

New Update
Kannada Actor Darshan : నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు!

Kannada Actor Darshan Video Call Viral : అభిమాని రేణుకాస్వామి (Renuka Swamy) హత్య కేసులో విచారణ ఖైదీగా జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ (Darshan) కి రాచమర్యాదలు లభిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఆదివారం సోషల్‌ మీడియా (Social Media) లో ఓ ఫోటో వైరల్‌ గా మారింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఆ ఫోటోకు బలాన్ని ఇస్తూ ఓ వీడియో సైతం బయటకు రావడం గమనార్హం.

publive-image

అందులో ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్‌ మాట్లాడినట్లుగా తెలుస్తుంది. వీడియో కాల్‌ లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడారు. అంతేకాకుండా మధ్యలో దర్శన్‌ చేతికి మొబైల్‌ ఇచ్చి పక్కకు జరిగినట్లు కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు హాయ్‌ చెప్పుకొంటూ పలకరించుకున్నారు.

అనంతరం తిన్నవా..అని అవతలి వ్యక్తి అడగగా..దర్శన్‌ నవ్వుతూ అయ్యిందని సమాధానం ఇచ్చాడు. కాసేపు మాట్లాడుకున్న తరువాత ఇద్దరూ బై చెప్పుకొన్నారు. 25 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్‌ మంచి వెలుతురు ఫుల్లుగా ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన వెనక ఉన్న కిటికీ కి పరదాలు, కొక్కేలకు దుస్తులు వేలాడదీసి కనిపిస్తున్నాయి.

దర్శన్‌ బెంగళూరు (Bangalore) లోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైలు బ్యారక్‌ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కలిసి కూర్చొని కాఫీ , సిగరెట్‌ తాగుతున్న ఫోటో ఆదివారం బయటకు వచ్చింది. ఈ ఫోటోను రౌడీ షీటర్‌ వేలు రహస్యంగా తన మొబైల్ లో తీసి తన భార్యకు పంపినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ గా మారడంతో పోలీసులుకు పెద్ద తలనొప్పి అయ్యింది. దర్శన్‌ పక్కన ఉన్న వారిలో రౌడీ షీటర్‌ విల్సన్‌ గార్డన్‌ నాగ కూడా ఉన్నారు. ఫోటోతో పాటు, వీడియో కాల్‌ కూడా బయటకు రావడంతో పోలీసుల పాత్ర పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీని గురించి డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు,. ఇతర నిందితుల విచారణ తరువాత తమకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.

Also Read : రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు