Kerala CM: నిన్న సిద్దరామయ్య.. నేడు పినరయ్ విజయన్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద సీఎంల ఆందోళన

కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తమకు కేంద్రం అన్యాయం చేస్తోంది బుధవారం ఢిల్లీలో జంతమంతర్ వద్ద సిద్దరామయ్య ఆందోళన చేయగా.. ఇప్పుడు తాజాగా కేరళ సీఎం పినరయ్ విజయన్‌ కూడా ఆందోళనకు దిగారు. ఇందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లు కూడా సంఘీభావం తెలిపారు.

New Update
Kerala CM: నిన్న సిద్దరామయ్య.. నేడు పినరయ్ విజయన్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద సీఎంల ఆందోళన

Kerala Govt to Protest at Jantar Mantar: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఆందోళన చేసేందుకు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ.. బుధవారం రోజున కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డేకే శివకుమార్‌ నేతృత్వంలో అక్కడ ఆందోళన చేస్తున్న విషయం సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ (Pinarayi Vijayan) కూడా జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.

ఢిల్లీ, పంజాబ్‌ సీఎంల సంఘీభావం

పినరయ్ విజయన్ కూడా కేంద్రం నుంచి నిధులు (Centre's Funds) అదే విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఆయనతో పాటుగా సీపీఎం(CPM) నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వాళ్లందరూ కేరళ హైస్‌ నుంచి జంతర్‌మంతర్‌ వరకు ర్యాలీగా వచ్చారు. అంతేకాదు వీళ్ల నిరసనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌లు కూడా వచ్చి సంఘీభావం ప్రకటించారు.అయితే కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఇందులో పాల్గొనేందుకు నిరాకరించింది. మరోవైపు కన్నడ నేతలు, తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు.

Also Read: ఢిల్లీకి సీఎం జగన్.. రేపు ప్రధాని మోడీతో భేటీ

మాకు అన్యాయం జరుగుతోంది

ఇక బుధవారం జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేసిన సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కేంద్రానికి అత్యధికంగా పన్నులు చెల్లించే రాష్ట్రాల్లో రెండో రాష్ట్రం కర్ణాటక అని.. కేంద్రం వైఖరి వల్ల తమ రాష్ట్రం రూ.1.88 లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందంటూ మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. 1972లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణకు పిలుపినిచ్చిందని తెలిపారు.

దేశ విభజనకు బీజాలు వేస్తున్నారు

ఆ పిలుపు మేరకే దక్షిణాది రాష్ట్రాలు జననాల సంఖ్యను నియంత్రించాయని పేర్కొన్నారు. ఇప్పుడు అదే తమకు శాపంగా మారిందంటూ వాపోయారు. మరోవైపు సిద్దరామయ్య చేసిన ఈ విమర్శలను ప్రధాని మోదీ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఖండించారు. వాళ్లు చేసే ఆరోపణలు దేశ విభజనకు బీజాలు నాటేలా ఉన్నాయంటూ విమర్శించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment