Mayavathi: కాన్షీరామ్‌కు కూడా భారతరత్న ఇవ్వాలి : మాయావతి బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించడం స్వాగతిస్తున్నామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అలాగే బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షిరాంకు కూడా దళితులు ఆత్మగౌరవంతో జీవించేలా కృషి చేశారని.. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 24 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు బిహార్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన వెనకబడిన వర్గాల కోసం కృషి చేశారనే గౌరవంతో ఆయనకు కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడైన కాన్షీరామ్‌కు కూడా భారతరత్న ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. Also Read: అయోధ్యలో భక్తుల రద్దీ.. వారిని దర్శనానికి వెళ్ళవద్దన్న ప్రధాని మోదీ..!! కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కర్పూరీ ఠాకూర్ 100వ జయంతి వేడుకల సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. కర్పూరీ ఠాకూర్ వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడారని.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేసినట్లు మాయవతి అన్నారు. కాన్షీరామ్ దళితులు ఆత్మగౌరవంతో బతికేలా చేశారు మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వడం సమంజసమేనని పేర్కొన్నారు. అలాగే దళితులు ఆత్మగౌరవంతో జీవించేలా బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కృషి చేశారని మాయావతి అన్నారు. ఆయన చేసిన కృషికి కూడా గౌరవం దక్కాలని చెప్పారు. దళితులు ఆత్మగౌరవంతో బతికేందుకు, వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా చేయడంలో కాన్షిరాం చేసిన కృషి చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అందుకే ఆయనకు సైతం దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. Also Read: పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్! #bsp #mayavathi #karpuri-thakur #kanshi-ram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి