Rajasthan Kota: కోటాలో విద్యార్థులు చనిపోతుంది ఎఫైర్ల వల్ల..మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు!

విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంది కేవలం వారికి ఉన్న ఎఫైర్ల వల్లే అంటూ ఆ రాష్ట్ర మంత్రి (MInister)వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

New Update
Rajasthan Kota: కోటాలో విద్యార్థులు చనిపోతుంది ఎఫైర్ల వల్ల..మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు!

గత కొద్ది కాలంగా రాజస్థాన్‌ (Rajasthan) లోని కోటా (Kota) జిల్లాలో విద్యార్థులు ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఓ నీట్ విద్యార్థిని (Neet Student) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. దానితో ఇప్పటి వరకు జిల్లాలో 25 ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంది కేవలం వారికి ఉన్న ఎఫైర్ల వల్లే అంటూ ఆ రాష్ట్ర మంత్రి (MInister)వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల కోచింగ్‌ కు ప్రధాన కేంద్రం రాజస్థాన్‌ లోని కోటా. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 25. దీని గురించి రాష్ట్ర మంత్రి శాంతి ధరీవాల్(Santhi dhareewal) మాట్లాడుతూ..అందరికంటే నెంబర్‌ 1 గా ఉండాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడి (Pressure) తో పాటు వారి ఎఫైర్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ మాట్లాడారు.

కొద్ది రోజుల క్రితం చనిపోయిన జార్ఖండ్‌ బాలిక ఆత్మహత్యకు గల కారణాలను ఓ లెటర్‌ లో రాసి మరీ చనిపోయింది. ఈ క్రమంలో ఆమెకు ఎఫైర్‌ ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి కేసు గురించి కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కేసుతో పాటు ఆయన మరో విద్యార్థి ఆత్మహత్య గురించి కూడా మాట్లాడారు. బిహార్‌ నుంచి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు బాగా ఒత్తిడి చేయడం వల్లే చనిపోయాడు. అందరికంటే వెనుకబడి పోతున్నానే భావనతో ఆ విద్యార్థి సూసైట్ చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మార్కులు తెచ్చుకోవాలని బాగా ఒత్తిడి చేయడం వల్లే పిల్లలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

ప్రస్తుతం మంత్రి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విద్యార్థుల గురించి అలా ఎలా మాట్లాడతారంటూ మండిపడుతున్నారు. కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలు ఎక్కువ అయిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హాస్టల్స్‌ లో ఆత్మహత్యలు జరగకుండా ఫ్యాన్లకు స్ప్రింగ్‌ లు ఉంచాలని ఆలోచనలో ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు