AP High Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మళ్ళీ దెబ్బ పడింది. క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిని సెప్టెంబర్‌ 19వ తేదీకి ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. మరోవైపు ఈ నెల 18 వరకు సీఐడీ పిటిషన్‌ వేసిన కస్టడీ పిటిషన్స్ మీద కూడా ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది.

New Update
AP High Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ (Quash Petition) మీద ఈరోజు విచారణ జరిగిన విషయం తెలిసిందే. దీనితో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో బెయిల్ మంజూరు కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరిగింది. వీటిల్లో క్వాష్‌ పిటిషన్‌ మీద విచారణ వాయిదా పడింది. ఈ నెల ( సెప్టెంబర్‌)19వ తేదీకి ఈ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. దాంతో పాటూ ఈ నెల 18వరకు సీఐడీ వేసిన పిటిషన్స్ పై కూడా ఎలాంటి విచారణ చేయవద్దని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ కస్టడీకి ఇవ్వద్దని ఏపీ హైకోర్టు (AP High Court)ను విజ్ఞప్తి చేశారు చంద్రబాబు లాయర్లు. దీనిపై స్పందించిన కోర్టు సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై పూర్తి వాదనలు ఇంకా వినాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. అందుకే వాయిదా వేస్తున్నామని తెలిపింది. కేసుకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

రాజకీయ కుట్రలో భాగం 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ హైకోర్టులో లాయర్‌ దమ్మాలపాటి శ్రీనివాస్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ గురించి చంద్రబాబు తరఫు న్యాయవాది శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈనెల 18 వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. స్కిల్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకుండానే అరెస్ట్ చేశారని చంద్రబాబు క్వాష్ పిటిషన్‌లో ఆరోపించారు. అంతేకాదు రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే.. తనను తప్పుడు కేసులో ఇరికించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్క్ శంకర్‌ను కాపాడిన సింగపూర్ స్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. పవన్‌‌తో మోదీ మాట్లాడి.. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

author-image
By K Mohan
New Update
PM modi pK

PM modi pK Photograph: (PM modi pK)

సింగపూర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక సమాచారాన్ని వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ కూడా పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేసి మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి, బాబు ఆరోగ్య పరిస్దితి గురించి మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో పవన్‌ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి 7గంటలకు ఫ్లైట్‌లో సింగపూర్ బయలుదేరనున్నారు.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడికి చికిత్స కొనసాగుతోందని జనసేన లీడర్ తెలిపారు. జరిగిన ప్రమాదంపై పవన్‌ కళ్యాణ్‌తో మోదీ మాట్లాడారని ఆయన చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాని మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Also read: Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment