/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet1-jpg.webp)
Aditya L1 solar mission 2023: అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో (ISRO) స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తుంది. ఇటీవల చంద్రయాన్-3(Chandrayaan-3)సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరి కోట వేదికగా రంగం సిద్ధమైంది. తాజాగా చంద్రయాన్-3తో జాబిలమ్మపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులు, వనరులపై అధ్యయనం మొదలుపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది.. ఆ తర్వాత PSLV C-57 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు.
కీలక ప్రయోగాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రో:
విశ్వ రహస్యాల గుట్టువిప్పడానికి సంకల్పం చేసిన ఇస్రో.. కీలక ప్రయోగాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ త్రీ సక్సెస్ తో.. అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడిన ఇస్రో.. లేటెస్ట్ గా ఆదిత్య-L1 ప్రయోగానికి రెడీ అయింది. ఆదిత్య ఎల్-1- సూర్యునిపై పరిశోధనలకు ఇస్రో చేస్తున్న తొలి ప్రయత్నం ఇది. ఇప్పటిదాకా చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేసిన ఇస్రో.. అద్భుత రహస్యాలను బయట పెట్టింది. అదే విధంగా సూర్యుడి రహస్యాలను కనిపెట్టడమే లక్ష్యంగా ఇస్రో ఆదిత్య-L1 ప్రయోగం చేపడుతోంది.
అధికారికంగా కౌంట్ డౌన్ స్టార్ట్:
ఇప్పటికే PSLV C-57 ప్రయోగానికి లాంచ్ అథరైజేషన్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరోవైపు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శ్రీహరి కోటకు చేరుకున్నారు. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. రాకెట్ లోని వివిధ విభాగాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి పై పరిశోధనలకు ఆదిత్య- L1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజ రాజన్ రాకెట్ కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్ డౌన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు.
సెప్టెంబర్ 02న PSLV C-57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం:
సెప్టెంబర్ 02వ తేదీన PSLV C-57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం జరగనుంది. సూర్యుని అయస్కాంత క్షేత్రంలో సంభవించే మార్పులు, కరోనియంలో ఉన్న పదార్థాలు, సూర్యునిలో నిత్యం జరిగే డైనమిక్ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి భారత్ చేస్తున్న తొలి ప్రయోగం ఇది. తరచూ మనం చూస్తున్న సౌర తుఫాన్ కారణంగా అంతరిక్షంలో ఉపగ్రహాలపై పడుతున్న ప్రభావంతో.. సమాచార వ్యవస్థపై అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఫోటో స్పియర్, క్రోమోస్పియర్ లపై పరిశోధనలు చేసి భూమిపై సూర్యుని వల్ల కలిగే దుష్పరిణామాలకు కారణాలు, పరిష్కారాలు చూపేందుకు అవకాశాలు తెలిసే అవకాశం ఉందని ఇస్రో చెప్తుంది.
ఇవి కూడా చదవండి:
Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!!
చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..!
IT Notices to Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు
AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!
అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.
Purandeshwari
AP News: అమరావతి రాజధానికి మోడీ సర్కార్ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు కేంద్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు వెల్లడించా. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు పట్టం కట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి, అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్లు గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం..
వరల్డ్ బ్యాంకు ద్వారా 15వేల కోట్లు, హడ్కో కింద 11వేల కోట్లు ఏపీకి అందించడానికి నిర్ణయం చేశారు. హడ్కో కింద 11వేల కోట్ల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో నేడు ఒప్పందం చేసుకున్నారు. 15వేల కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు కలిపి 13వేల 600కోట్లు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1400కోట్లు అందిస్తుంది. ఈ 15వేల కోట్లు మొబలైజేషన్ లో 25శాతం గ్రాంట్ కింద ఇస్తామని కేంద్రం చెప్పిన విధంగా ఇటీవల 4వేల 285 కోట్లు కేంద్రం అందించింది. కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని అందిపుచ్చుకుంటూ అమరావతిని అద్భుతంగా అభివృద్ది చేయాలని కోరుతున్నాను అని పురంధేశ్వరి వివరించారు.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
bjp-purandeswari | amaravathi | telugu-news | today telugu news
వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
Life Style: 20-20-20 ఫార్ములా ఎప్పుడైనా ట్రై చేశారా? స్క్రీన్స్ ముందు ఉండేవారికి ఇది చాలా ముఖ్యం
Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై బిగ్గెస్ట్ డిస్కౌంట్ భయ్యా.. వదిలారో మళ్లీ మళ్లీ రాదు!