లాంఛ్ రిహార్సల్ పూర్తి... ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్.....!

ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ఆదిత్య ఎల్-1కు సంబంధించి లాంఛ్ రిహార్సల్ పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ కు సంబంధిచి ఏర్పాట్లు జరుతున్నాయని ఇస్రో పేర్కొంది. సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది.

author-image
By G Ramu
New Update
లాంఛ్ రిహార్సల్ పూర్తి... ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్.....!

చంద్రయాన్-3 తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) రెడీ అవుతోంది. తాజాగా ఆదిత్య-ఎల్ 1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆదిత్య ఎల్-1 కు సంబంధించి లాంఛ్ రిహార్సల్ ను ఇస్రో పూర్తి చేసింది. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ కు సంబంధిచి ఏర్పాట్లు జరుతున్నాయని ఇస్రో పేర్కొంది.

ఈ మిషన్ కు సంబంధించి లాంఛ్ రిహార్సల్, రాకెట్ లో అంతర్గత తనిఖీలు పూర్తి చేశామని వెల్లడించింది. ఇక సూర్యునిపై పరిశోధనలు జరిపేందుకు ఇస్రో చేపట్టిన మిషన్ ఆదిత్య ఎల్-1. ఈ మిషన్ లో భాగంగా భూమికి 1.5 మిలియన్ల దూరంలో వున్న లాగ్రాంజియన్ పాయింట్ చుట్టు ఉండే కక్షలో ఈ శాటిలైట్ ను ప్రవేశ పెట్టనున్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.

also read: సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ముహుర్తం ఫిక్స్.. ప్రజలకు ఆహ్వానం

ఈ శాటిలైట్ ను లాగ్రాంజియన్ పాయింట్ కక్షలో ప్రవేశ పెట్టడంతో సూర్యున్ని ఎలాంటి అడ్డంకులు లేదా గ్రహణాలు లేకుండా చూసే అవకాశం కలుగుతుందని ఇస్రో పేర్కొంది. ఈ శాటిలైట్ లో ఉండే పేలోడ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్, పర్టికల్ డిటెక్టర్స్ ను ఉపయోగించి సూర్యునిలో ఉండే ఫోటో స్పియర్, క్రోమో స్పియర్, ఇతర పొరల గురించి పరిశోధనలు చేసి సమాచారాన్ని అందించనుంది.

also read: చంద్రయాన్ నుంచి మరో కీలక అప్ డేట్…. చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించిన ఇస్రో…!

ఆదిత్య-ఎల్ 1 పేలోడ్‌ సూట్ కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ-ఫ్లేర్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణం డైనమిక్స్, రేణువులు, క్షేత్రాల వ్యాప్తిని అధ్యయనం చేసేందుకు, వాటి సమస్యలను అర్థం చేసుకునేందుకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తాయని వివరించింది. ఇది ఇలా వుంటే తాజాగా చంద్రయాన్-3లోని ప్రజ్జాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ ఫోటోలను తీసింది. దానికి సంబంధిచిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

also read: విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత… తెరపైకి కొత్త పేరు….!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట.

New Update
kerala emp

kerala emp

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా...అతడిని మరో వ్యక్తి మోకాళ్ల పై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ...నిర్దేశించిన టార్గెట్‌ ను పూర్తి చేయని ఉద్యోగుల పై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

Also Read: Local Body Elections : ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు

పోలీసుల సమాచారం ప్రకారం..కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్‌ సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలిసిందన్నారు.ఘటన మాత్రం పెరుంబవూర్‌ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే యజమాని మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది.దీని పై ఉద్యోగులు ఇప్పటి వరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం.

ఈ అమానవీయ ఘటన పై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలు షాక్‌ కు గురి చేశాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్‌ కుట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన వెల్లడించారు. ఈ ఘటన పైపూర్తి స్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

Also Read: TDP vs Jana Sena : పిఠాపురంలో రచ్చరచ్చ..రెండోరోజు నాగబాబుకు తప్పని నిరసన సెగ

Also Read: Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు

 kerala | employees | tortured | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment