AdiKeshava: నెట్ ఫ్లిక్స్ లో ‘ఆదికేశవ’.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్

వైష్ణవ్ తేజ్ హీరోగా నవంబర్ చివరివారంలో రిలీజైన 'ఆదికేశవ' మూవీ యూత్ కు కొంతవరకూ బాగానే కనెక్టైంది. థియేటర్లలో అంచనాలకు తగిన రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయిన ఈ మూవీ అతిత్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

New Update
AdiKeshava: నెట్ ఫ్లిక్స్ లో ‘ఆదికేశవ’.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్

AdiKeshava movie: వైష్ణవ్ తేజ్ హీరోగా నవంబర్ చివరివారంలో రిలీజైన 'ఆదికేశవ' మూవీ యూత్ కు కొంతవరకూ బాగానే కనెక్టైంది. యూత్ పెయిర్ కావడంతో ఈ సినిమాకు అంత క్రేజ్ వచ్చినప్పటికీ లవ్ కన్నా యాక్షన్ పాళ్లు ఎక్కువ కావడంతో పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. థియేటర్లలో అంచనాలకు తగిన రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయిన ఈ మూవీని ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది.

ఇది కూడా చూడండి: తెలంగాణ వణుకుతోంది.. చ‌లి పంజాకు జ‌నం గజగజ

సితార నాగవంశి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు, శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్టర్. హీరోయిన్ గా శ్రీలీల, విలన్ క్యారెక్టర్ లో జోజు జార్జ్ నటించారు. డిసెంబరు 22 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు