Vidya Balan : ఆ సినిమా టైంలో స్మోకింగ్ అలవాటైంది.. రోజుకు రెండు, మూడు సిగరెట్లు తాగుతా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు? బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ తాజా ఇంటర్వ్యూలో 'డర్టీ పిక్చర్' సినిమా టైంలో స్మోకింగ్ అలవాటైందని, రోజుకు రెండు, మూడు సిగరెట్లు తాగే దాన్ని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. By Anil Kumar 28 Apr 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Actress Vidya Balan About her Smoking Addiction: బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్. ఓ వైపు అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరోవైపు పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అందులో ఈమె నటించిన 'డర్టీ పిక్చర్' (The Dirty Picture) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో విద్య బాలన్ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటించింది. అయితే ఈ సినిమా టైం లోనే ఈ హీరోయిన్ సిగరెట్ కి బానిస అయిందట. ఇదే విషయాన్ని విద్యా బాలన్ స్వయంగా వెల్లడించడం గమనార్హం. మాములుగా సెలెబ్రెటీలకు స్మోకింగ్ అలవాటు లేకపోయినా కొన్ని సార్లు కథ డిమాండ్ చేస్తే సిగరెట్ తాగాల్సి వస్తుంది. ఓ సినిమా విషయంలో విద్యా బాలన్ కి ఇదే పరిస్థితి ఎదురయ్యిందట. దాంతో చేసేదేమి లేక సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేసిందట. ఈ విషయాన్ని విద్యా బాలన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలుస్తా తాజా ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ.." నాకు సిగరెట్ ఎలా తాగాలో తెలుసు కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. డర్టీ పిక్చర్ సినిమాలో నా పాత్ర సిగరెట్ తాగుతూ ఉంటుంది. సిగరెట్ తాగుతున్నట్లు నటిస్తే ఆ సీన్ బాగా రాదు. అందుకే సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నా. సినిమా పూర్తయ్యాక ఆ అలవాటు మానలేకపోయా. రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలిస్తే తప్ప మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆడవాళ్ళూ సిగరెట్లు తాగేతే అదో పెద్ద నేరంగా భావించే వాళ్ళు. కానీ ఇప్పుడలా కాదు. ఇప్పుడైతే సిగరెట్లు తాగడం లేదు. కాలేజీ రోజుల్లో బస్ స్టాప్ లో సిగరెట్ తాగే వాళ్ళ పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగను ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు బాగా నచ్చేది" అంటూ చెప్పుకొచ్చింది. దీంతో విద్యా బాలన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్స్ రకరాలుగా రియాక్ట్ అవుతున్నారు. Also Read : ఇండియాలో అందరికంటే గొప్ప నటుడు ఆయనే.. స్టార్ హీరోపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు? #vidya-balan #vidya-balan-interview మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి