Varalakshmi Sarath kumar: ప్రధాని మోదీకి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహ ఆహ్వానం.. ఫొటోలు వైరల్..! నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీకి వెడ్డింగ్ కార్డు అందజేసి పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించారు. By Archana 29 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Varalakshmi Sarath kumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని పెళ్లాడనుంది. ఈ నేపథ్యంలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తన పెళ్లి ఆహ్వాన పత్రికలను అతిథులకు, సినీ, రాజకీయ ప్రముఖులకు అందజేయడం మొదలు పెట్టారు.ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులకు తన వివాహ ఆహ్వానాన్ని అందించారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా తన వివాహానికి ఆహ్వానించారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్.కాబోయే భర్త, తల్లిదండ్రులు రాధికా, శరత్‌కుమార్ తో కలిసి ప్రధాని మోదీకి వెడ్డింగ్ కార్డు అందజేసి పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవలే టాలీవుడ్ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ, నిర్మాత అల్లు అరవింద్, సమంత, అల్లు అర్జున్ పలువురికి తమ పెళ్లి ఆహ్వానాన్ని అందించారు నటి వరలక్ష్మి. What a privilege it was to have met Our Hon'ble Prime Minister Shri @narendramodi ji and invited him for our reception..thank you for being so warm & welcoming.. spending so much of your valuable time with us despite your very busy schedule.. truly an honour sir..thank you daddy… pic.twitter.com/guqu6D8poG — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) June 29, 2024 Also Read: Varalakshmi Sarath kumar : అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా? - Rtvlive.com #narendra-modi #varalakshmi-sarath-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి