Actress Sreeleela : శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. శివ కార్తికేయన్‌ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం.ఈ ప్రాజెక్ట్‌లో శివకార్తికేయన్‌కు జోడీగా శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం.ఇప్పటికే వీళ్లిద్దరిపై ఫొటోషూట్‌ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

New Update
Actress Sreeleela : శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

Actress Sreeleela : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల మళ్ళీ వరుస ఆఫర్స్ తో బిజీ అవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో 'గుంటూరు కారం' సినిమాతో ఆడియన్స్ ను పలకరించిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు కానీ ఇతర భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు కోలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇవ్వబోతుంది.

Also Read : బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘పుష్ప’ పార్ట్-3 పై అదిరిపోయే అప్డేట్

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్‌ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్నట్లు కొన్నాళ్లుగా తమిళ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లో శివకార్తికేయన్‌కు జోడీగా శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీళ్లిద్దరిపై ఫొటోషూట్‌ పూర్తి చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు